
ఆఫీసుకెళ్లాలి అంటూ సరదాగా కొందరు బయలుదేరతారు. ఆ సరదా వెనక పనిమీద శ్రద్ధో, కొలీగ్స్‌తో బాతాఖానీ కొట్టచ్చనో... అది వారికే తెలియాలి. పనివేళల్లో పదిసార్లు టీ ఆర్డర్లు ఇస్తూ, కాలుకాలిన పిల్లిలా ఆఫీసులో పచార్లు చేసేవారిని చూస్తూనే ఉంటాం. వీరికి ఆఫీస్ అంటే టైంపాస్. కొంతమంది ఎంపీత్రీలతో ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు టైంపాస్ చేస్తుంటారు. పనిమీద శ్రద్ధ చూపకుండా, చేయవలసిన పనిని విపరీతంగా పెంచుకుని చివరిన ఆపసోపాలు పడుతుంటారు. ఫలితం మెమోలు కావచ్చు, సస్పెన్షన్‌లకు దారితీయచ్చు. పనిమీద మీ ఇంటరెస్ట్ ఎంత అన్నది ఒకసారి చెక్ చేసుకోండి.
1. ఎక్కువగా సిక్‌లీవ్‌లు తీసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
2. పనిచేసినట్లు నటిస్తూ, నెట్‌తో ఎక్కువసేపు గడుపుతారు.
ఎ. అవును బి. కాదు
3. అనవసరమైన మెసేజ్‌లు అందరికీ పంపుతారు.
ఎ. అవును బి. కాదు
4. ఆఫీస్ టైంలో స్నేహితులతో ఫోన్‌చేసి మాట్లాడుతుంటారు.
ఎ. అవును బి. కాదు
5. టీ తాగుతూ చాలా సమయాన్ని గడుపుతారు.
ఎ. అవును బి. కాదు
6. అలారాన్ని వాడే సందర్భాలు చాలా తక్కువ.
ఎ. అవును బి. కాదు
7. లంచ్ సమయంలో చాలా ఎక్కువసేపు కొలీగ్స్‌తో ఉంటారు.
ఎ. అవును బి. కాదు
8. మీరు ఇంటికెళ్లేసరికి చాలా ఆలస్యం అవుతుంది. వర్క్ పూర్తికాలేదని కంగారు పడతారు.
ఎ. అవును బి. కాదు
9. పనిలో సహాయం చేయమని మీ సహచరులను అభ్యర్థించే సందర్భాలు తరచూ ఎదురవుతుంటాయి.
ఎ. అవును బి. కాదు
10. ఇతరుల పనికి అవరోధం కలిగిస్తూ ఎప్పుడూ మాట్లాడుతుంటారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఏడు దాటితే మీరు పనిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఖాళీ దొరుకుతుందా అని చూస్తుంటారే కాని, పనిమీద ధ్యాస ఉంచరు. మీలానే అందరూ ఉండాలని కోరుకుంటారు. పనిని గౌరవించి ప్రేమించటం నేర్చుకోండి. ‘బి’ లు ఆరు దాటితే మీకు çపని పట్ల ఆసక్తి ఎక్కువ. వృత్తిని గౌరవిస్తారు. ఒకరిచేత మాట పడకూడదనుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment