Colleagues
-
ఊపిరి నిలిపిన మానవత్వం
కష్టాల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలన్న మనసు, సంకల్పం ఉన్న నలుగురు మనచుట్టూ ఉంటే చాలు అది ఎంత పెద్ద కష్టమైనా కరిగిపోతుంది. కాయకష్టం చేసి బతుకుపోరు సాగించే తమలో ఒకడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతుంటే చలించిపోయారా తోటి కూలీలు. బింధువులే సింధువైనట్లు..అందరూ ఒక్కటై తమకు తోచిన సాయం చేసి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. సాక్షి, ప్రకాశం (ముండ్లమూరు) : కష్టకాలంలో తోడబుట్టిన వాళ్లనే పట్టించుకోని రోజులివి. అలాంటిది తోటి కూలికి ఆపద వస్తే అండగా నిలిచి మేమున్నాం అంటూ అందరూ ఒక్కటై లక్షల రూపాయలు విరాళాలుగా వసూలు చేసి అతనికి మరో జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. ముండ్లమూరు మండలం వేముల పంచాయతీలోని రమణారెడ్డిపాలెం గ్రామంలో సుమారు 300 కుటుంబాలున్నాయి. అన్ని గ్రామాల్లానే ఆ గ్రామంలోనూ మూడు పార్టీలు, రెండు మతాల వారు ఉన్నారు. కానీ ఆపదలో ఒక్కటై ఒకరికొకరు అండగా నిలిచి తోటి వారిలో మనోధైర్యాన్ని నింపారు. గ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాశ్యులు కావడంతో వారంతా బేల్దారి పనులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. పదిమంది ఒక ముఠాగా ఏర్పడి కూలి పనులకు వెళ్తుంటారు. అందులో భాగంగా ఏటా తొలి ఏకాదశి అనంతరం ఇతర గ్రామాలకు వలసలు పోతుంటారు. ఈ ఏడాది బత్తుల నాగరాజు పదిమందిని తీసుకొని బతుకుదెరువు కోసం హైదరాబాద్ సెప్టెంబర్ మొదటి వారం వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే జ్వరం బారిన పడ్డాడు. పనుల హడావిడిలో పట్టించుకోక పోవడంతో ముదిరి డెంగీగా మారింది. అనుకోకుండా పడిపోవడంతో దగ్గరలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నాగరాజు బాగా క్షీణించడంతో మెరుగైన వైద్యసేవలు అవసరమని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎస్ఎల్జీ (శ్రీలక్ష్మీ గాయత్రి) సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలో చేర్చారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసిన అనంతరం నాగరాజుకి లివర్ పూర్తిగా దెబ్బతినిందని దీనికి తోడు డెంగీ అని నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో లాభంలేదని చెప్పారు. అప్పటికే అక్కడ మూడు లక్షల పదిహేను వేలరూపాయలు ఖచ్చు చేశారు. బతుకుతాడో లేదో చెప్పలేం గానీ హాస్పటల్లో రోజుకి లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అప్పటికే బంధువుల వద్ద మూడు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే గత ఏడాది నాగరాజు తండ్రి బాలకోటయ్యకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అందిన కాడికి అప్పులు చేసి చూపించినా తండ్రి బతకలేదు. వారు రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజుకి లక్ష రూపాయలు అంటే చాలా కష్టంతో కూడిన పని, ఇక వారికి అప్పు ఇచ్చేవారు కూడా లేరు. దీంతో నాగరాజుపై ఆశలు వదులుకున్నారు. తోటి కూలీల ఆపన్నహస్తం: ఇదే సమయంలో గ్రామానికి చెందిన మేస్త్రీలు, కూలీలు అతడిని చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. పరిస్థితి విషమించడంతో మనతో నిన్నటి వరకు కలిసి పని చేసిన వ్యక్తిని ఎలాగైనా బతికించుకుందాం అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. నాగరాజు వైద్య ఖర్చుల కోసం తమకి తోచినంత సహాయం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరు తమ వెసులుబాటుని బట్టి రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు విరాళాలుగా నగదుని రూ.5,18,000 వసూలు చేశారు. వారికి తెలిసిన వైద్యులకు రిపోర్టులను చూపి వారి సలహా మేరకు నాగరాజుని హైదరాబాద్ నుంచి మంగళగిరి వద్ద ఎన్ఆర్ఐ వైద్యశాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. వెంటిలేటర్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లో సెప్టెంబర్ 23న ఎన్ఆర్ఐకి చేరుకున్నారు. నాగరాజు పరిస్థితిని చూసిన అక్కడి వైద్యులు లాభంలేదు, ఒంగోలు రిమ్స్‌కి తీసుకెళ్లండని సూచించారు. అక్కడ తెలిసిన మెడికల్ కాలేజి ప్రొఫెసర్ సహాయంతో అక్కడే వైద్యం చేయించేందుకు ఒప్పించారు. నాగరాజుకి ఏమైనా ప్రాణాపాయం అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకొన్న వైద్యులు నాగరాజుకి మళ్లీ అన్నీ పరీక్షలు చేసి చికిత్స చేయడం ప్రారంభించారు. దీంతో అతని పరిస్థితి రోజు రోజుకి కుదుట పడడంతో బతుకు పై ఆశలు చిగురించాయి. మరో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయగా కొంత మేర కోలుకోవడంతో నాగరాజుని ఈనెల 9న ఇంటికి పంపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడింది. అందరి సహాయ సహకారాలతో నాగరాజు బతకడంతో గ్రామంలో ఇలాంటి అపాయం ఎవరికి వచ్చినా తామంతా అండగా నిలుద్దామని యువకులు నిర్ణయానికి వచ్చారు. తమకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నాగరాజు కుటుంబ సభ్యులు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎస్ఎల్జీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజు (ఫైల్) -
మత్తుమందు ఇచ్చి ఉద్యోగినిపై అత్యాచారం
న్యూఢిల్లీ: తన కంపెనీలో పనిచిచేసే ఇద్దరు ఉద్యోగులు తనపై సామూహిక అత్యాచారం జరిపారని బహుళ జాతి కంపెనీలో పనిచేసే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరినప్పుడు సహోద్యోగులు ఇద్దరు తనకు కారులో లిఫ్టు ఇచ్చినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కారులో తనకు పానీయాన్ని ఇచ్చారని, దానిని తాగి తాను స్పృహ కోల్పోయానని ఆమె తెలిపింది. పానీయంలో మత్తు మందు కలిపారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరు తనపై వంతులవారీగా అత్యాచారం జరిపి, వసంత్‌కుంజ్‌లో ఓ చోట తనను వదిలి వెళ్లారని ఆమె తెలిపింది. తాను ఎలాగోలా ద్వారకాలో ఉన్న ఇంటికి చేరి పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు మహిళ తెలిపింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేçసు నమోదు చేసి వైద్య పరీక్ష అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు -
పనంటే బోర్ కొడుతోందా?
ఆఫీసుకెళ్లాలి అంటూ సరదాగా కొందరు బయలుదేరతారు. ఆ సరదా వెనక పనిమీద శ్రద్ధో, కొలీగ్స్‌తో బాతాఖానీ కొట్టచ్చనో... అది వారికే తెలియాలి. పనివేళల్లో పదిసార్లు టీ ఆర్డర్లు ఇస్తూ, కాలుకాలిన పిల్లిలా ఆఫీసులో పచార్లు చేసేవారిని చూస్తూనే ఉంటాం. వీరికి ఆఫీస్ అంటే టైంపాస్. కొంతమంది ఎంపీత్రీలతో ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు టైంపాస్ చేస్తుంటారు. పనిమీద శ్రద్ధ చూపకుండా, చేయవలసిన పనిని విపరీతంగా పెంచుకుని చివరిన ఆపసోపాలు పడుతుంటారు. ఫలితం మెమోలు కావచ్చు, సస్పెన్షన్లకు దారితీయచ్చు. పనిమీద మీ ఇంటరెస్ట్ ఎంత అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. 1. ఎక్కువగా సిక్‌లీవ్‌లు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. పనిచేసినట్లు నటిస్తూ, నెట్‌తో ఎక్కువసేపు గడుపుతారు. ఎ. అవును బి. కాదు 3. అనవసరమైన మెసేజ్‌లు అందరికీ పంపుతారు. ఎ. అవును బి. కాదు 4. ఆఫీస్ టైంలో స్నేహితులతో ఫోన్‌చేసి మాట్లాడుతుంటారు. ఎ. అవును బి. కాదు 5. టీ తాగుతూ చాలా సమయాన్ని గడుపుతారు. ఎ. అవును బి. కాదు 6. అలారాన్ని వాడే సందర్భాలు చాలా తక్కువ. ఎ. అవును బి. కాదు 7. లంచ్ సమయంలో చాలా ఎక్కువసేపు కొలీగ్స్‌తో ఉంటారు. ఎ. అవును బి. కాదు 8. మీరు ఇంటికెళ్లేసరికి చాలా ఆలస్యం అవుతుంది. వర్క్ పూర్తికాలేదని కంగారు పడతారు. ఎ. అవును బి. కాదు 9. పనిలో సహాయం చేయమని మీ సహచరులను అభ్యర్థించే సందర్భాలు తరచూ ఎదురవుతుంటాయి. ఎ. అవును బి. కాదు 10. ఇతరుల పనికి అవరోధం కలిగిస్తూ ఎప్పుడూ మాట్లాడుతుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీరు పనిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఖాళీ దొరుకుతుందా అని చూస్తుంటారే కాని, పనిమీద ధ్యాస ఉంచరు. మీలానే అందరూ ఉండాలని కోరుకుంటారు. పనిని గౌరవించి ప్రేమించటం నేర్చుకోండి. ‘బి’ లు ఆరు దాటితే మీకు çపని పట్ల ఆసక్తి ఎక్కువ. వృత్తిని గౌరవిస్తారు. ఒకరిచేత మాట పడకూడదనుకుంటారు. -
అవునట!
వాలెంటైన్స్ డే దగ్గరికి వస్తోంది. అన్ని చోట్లా రొమాన్స్ విరబోసే కాలం ఇది. అయితే ఈ ఏడాది ‘ఆఫీస్ రొమాన్స్’ బాగా తగ్గిపోయిందని రిలేషన్షిప్ ఎక్స్‌పర్ట్‌లు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు! అంత దిగ్భ్రాంతి అవసరం లేదు కానీ, ‘యంగ్ వాయిసెస్’ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ లిజ్ వోల్ఫ్ ఆ ఎక్స్‌పర్ట్‌ల చేత చిన్న సర్వే చేయిస్తే.. ఈ విషయం బయటపడింది! ‘మీ టూ’ ఎఫెక్ట్‌తో యు.ఎస్.లోని చాలా ఆఫీస్‌లలో మగాళ్లు తమ ఫిమేల్ కొలీగ్స్‌తో అంటీముట్టనట్లు ఉంటున్నారట. దాంతో పలకరింపులు తగ్గి, కనికరం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారట. కనికరం ఏంటి? పనిఒత్తిడితో ఆడవాళ్లు అవస్థలు పడుతుంటే, మగవాళ్లు ఆ ఒత్తిడిని కొంత షేర్ చేసుకోవడం ఏ ఆఫీస్‌లోనైనా సహజమే. ఇప్పుడు అదీ లేకుండా పోయిందట. హాయ్‌లు చెప్పుకోవడం, బాయ్‌లు చెప్పుకోవడం వరకే ఆడామగ రిలేషన్స్ పరిమితం అయిపోయి, కలిసి బ్రేక్ తీసుకోడానికి కూడా మగవాళ్లు సంశయిస్తున్నారని ఎక్స్‌పర్ట్‌లు ‘యంగ్ వాయిసెస్’ ఎడిటర్‌కి నివేదిక ఇచ్చారు. ఎంతోకాలంగా పరిచయం ఉన్న కొలీగ్‌తో కూడా జోక్‌లు వేయడానికి, హ్యాండ్ షేక్ ఇవ్వడానికి, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడ్డానికి పురుష ఉద్యోగులు సంశయించడంతో.. ఆఫీస్‌లలో ఒకలాటి ‘జెండర్ వార్’ పరిస్థితులు ఏర్పడ్డాయని కొంతకాలంగా అమెరికన్ మీడియా కూడా అంటోంది. దీన్ని బట్టి ఏం అర్థమౌతోంది? హెరాస్మెంట్ కొత్త పుంతలు తొక్కిందని! -
సహోద్యోగులే స్నేహితులు!
స్కిల్ డెవలప్మెంట్ కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. పనిచేసే చోట స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించుకోవాలి. సహోద్యోగులను స్నేహితులుగా, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారాన్ని కనుగొనడంలో మార్గం చూపే వ్యక్తులుగా మలచుకోవాలి. అప్పుడే వృత్తిగత జీవితం వర్ధిల్లుతుంది. ఈ క్రమంలో తోటి ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు సూచనలు.. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆఫీసు వాతావరణం కొత్తగా ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా కూర్చోకుండా, చొరవ తీసుకొని సహోద్యోగులతో మాట కలపాలి. టీ, లంచ్ బ్రేక్‌లో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పనిచేసే చోట కుదురుకునేందుకు వీలవుతుంది. సహచర ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. చక్కటి పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తోటి ఉద్యోగులకు దగ్గర కావొచ్చు. వీలైనంత వరకు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదు. మంచి ఆలోచనలను పంచుకుంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే తోటి ఉద్యోగులే మీతో స్నేహం చేయడానికి పోటీపడతారు. బ్రేక్ సమయాల్లో లేనిపోని గొప్పలు చెప్పుకోకుండా.. వృత్తికి సంబంధించిన లేదా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై తోటి ఉద్యోగులతో చర్చించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ మంది స్నేహితులుగా మారడానికి దోహదం చేస్తుంది. సాయం చేయడంలో ముందుండాలి తోటి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉంటే.. చొరవ తీసుకొని, సాయం చేయడంలో ముందుండాలి. ఇలా చేస్తే వారు మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోరు. చిన్న చిన్న కారణాలతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు.. మీరే ముందుగా సారీ చెప్పండి. కొద్ది సేపు ఏకాంతంగా కూర్చుని, అన్ని అంశాలనూ చర్చించుకోండి. * మీతో మంచిగా ఉంటూ.. మీ గురించి ఇతరులతో చెడుగా చెప్పేవారిని దూరం పెట్టాలి. * మీ ఆలోచనలను కాపీ కొట్టి.. బాస్ దగ్గర మంచి పేరు కొట్టెయ్యాలనుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి. * చక్కటి పనితీరు కనబరిచే వారిపై లేనిపోని రూమర్లు పుట్టించి, వారిని పక్కదారి పట్టించాలని చూసేవారి మాటలు పట్టించుకోవద్దు. * పని విషయంలో ఇతరులను పోటీదారులుగా భావించకుండా, బృంద స్ఫూర్తితో అడుగేయాలి. -
సహచరులపై స.హ. దుర్మార్గం?
విశ్లేషణ జనహిత సమాచారం తీసుకోవడా నికే సమాచార హక్కు. చట్టబద్ధమైన హక్కులు కాపాడుకోవడానికి పనికి వచ్చే సమాచారాన్నీ కోరవచ్చు. కాని సహచరులను వేధించడానికి పుంఖా నుపుంఖాలుగా దరఖాస్తులు పెడితే అది దుర్మార్గమూ, దుర్వినియో గమూ అవుతుంది, ఆ పని చేసిన ఉద్యోగిపై దుష్ర్పవర్తన కింద యజ మానులు క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఢిల్లీ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయోగ శాలలో, గ్రంథాలయంలో పనిచేసే ఇద్దరు సహాయ ఉద్యో గులు తమకు ప్రమోషన్ ఇవ్వలేదని కళాశాల యాజమాన్యం మీద పగబ ట్టారు. కొందరు తమ ప్రమోషన్‌ను అడ్డుకుంటున్నారని వీరు భావించారు. తమపైన ఫిర్యాదు చేశారని, క్రమశిక్షణా చర్య తీసుకున్నారని, సాక్ష్యం చెప్పారని కొందరిని అనుమానించి వారి గురించి ఆర్టీఐ ప్రశ్నలు వేశారు. వారి దాడికి ప్రిన్సిపల్ కూడా గురయ్యారు. వారి రెండో అప్పీలు విచారణకు వచ్చినప్పుడు అయి దుగురు ఉద్యోగులు హాజరై, ఈ ఇద్దరు దుర్మార్గుల సమాచార అభ్యర్థనలకు అంతులేకుండా పోతున్నదని వాపోయారు. ఆఫీసులో పనిచేయకుండా పనివేళలను సమాచార ప్రశ్నలు తయారు చేయడానికి, కుట్రలు చేయడానికి వాడుకుంటు న్నారని, పాఠాలు చెప్పరని, విద్యార్థులకు సాయం చేయడం లేదనీ, వీరు అడిగే సమాచారమంతా స్వార్థం, పగ, ప్రతీకా రంతో కూడినవేనని మొరపెట్టుకున్నారు. ఒక మహిళ.. తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా వీడియో తీసి, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అతడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడని చెబుతూ ఒక ఉపా ధ్యాయిని ఒక ప్రింట్ అవుట్ సమర్పించింది. ఈ దుర్వినియోగ ఉద్యోగి ఫొటో అతని వ్యాఖ్యానాలతో సహా వీడియో చూస్తే అతనే కారకుడని తేలిపోతుంది. పని చేయకుండా సహచరుల పనులు చెడగొడుతూ, ప్రభుత్వ సంస్థను నిస్సహాయ స్థితికి తీసుకువస్తే అంతకన్నా హాని ఏముంటుందని, ఈ చట్టం వచ్చింది ఇందుకు కాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలోని తమ సహచరు లందరూ ఈ ఇద్దరు దుర్మార్గుల దుర్వినియోగ సమాచార ప్రశ్నలకు ఫైళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారని ఉద్యోగులు కమిషన్‌కు విన్నవించారు. లిఖిత పూర్వకంగా వీరి దుర్మా ర్గాలను వివరించారు. ప్రిన్సిపల్ తనను ఈ ఇద్దరి వేధింపుల నుంచి విముక్తులను చేయాలని కోరారు. సహచరుల వైద్య ఖర్చుల బిల్లులు, రోగాలు తదితర వ్యక్తిగత వివరాలు కోరే హక్కుపై పరిమితులున్నాయి. అన్నింటినీ వక్రీకరించి వేధిస్తున్నారని చాలా వివరంగా ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. సమస్యా పరిష్కార విభాగాన్ని కూడా వారు దుర్వినియోగం చేసారు. వారు చేసిన 36 ఫిర్యాదులు ఒకే రకమైనవి. అసలవి ఫిర్యాదులే కాదు. వేధింపు ఉత్తరాలని చెప్పి వాటిని తిరస్క రించారు. ఆ వివరాలన్నీ కమిషన్ ముందుంచారు. అంబేడ్కర్ కాలేజీ వీడియో తీసి వాట్సప్, ఫేస్బుక్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం నేరం అవుతాయి. వ్యక్తులు తమ స్థాయిలోనూ, కళాశాల యాజమాన్యం తమ స్థాయిలోనూ ఈ దుర్మార్గులపై చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టాలను వినియోగించే అధికారం ఉందని తెలియక ఏ చర్యలూ తీసుకోకపోవడం వల్ల దుర్మార్గుల ఆటలు సాగు తున్నాయి. అంబేడ్కర్ కాలేజీలో పనిచేసే ఒక మహిళ.. తమ కళాశాలలోని సహాయ ఉద్యోగులలో ఒక వ్యక్తి తనపైన దుష్ర్ప చారం చేస్తున్నాడని ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాల స్థాయిలో నోటీసు ఇచ్చి చర్య తీసుకోవలసిన విషయ మని మహిళా కమిషన్ భావించింది. ఆ చర్య తీసుకోక పోవడం వల్ల ఈ దుర్మార్గుడికి బలం చేకూరింది. ఆ సహచర ఉద్యోగి వివరాలను, అనవసర సమాచారాన్ని, వ్యక్తిగత సమా చారాన్ని ఇవ్వాలని అతడు వేధించసాగాడు. సమాచార చట్టంపై పూర్తి అవగాహన లేని వారు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని తెలియని వారు ఎక్కువగా ఉండడం వల్ల ఈ దుర్మార్గులు చెలరేగిపోతున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక దేహశుద్ధి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చిన్న చిన్న సంస్థలలో జరిగే ఇలాంటి వాటిని మీడియా పట్టించుకోదు. కనుక వీరి గురించి అందరికీ తెలియదు. కాని చర్య తీసుకునే అధికారాన్ని విద్యా సంస్థల యాజమాన్యం వినియోగించుకోకపోవడం వల్ల దుర్విని యోగం పెరుగుతున్నది. మౌనంగా భరిస్తూ ఏడ్వడం వల్ల దుర్మార్గం విజృంభిస్తుంది. క్రమశిక్షణా చర్య ఒక్కటి గట్టిగా తీసుకుంటే చాలు వీరి ఆట కట్టయిపోతుంది. ప్రభుత్వ సంస్థలు కీలకమైన పనులు చేయనీయకుండా అడ్డుకునే దుర్వినియోగదారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా సంస్థల అధికారులు పరిశీలించి, దానికి సమంజసమైన విధానాన్ని, ప్రక్రియను రూపొం దించాలి. క్రమశిక్షణా నియమాల్లో పారదర్శకతకు స్థానం కల్పిస్తూనే దుర్వినియోగ వ్యతిరేక చర్యలపై నియమాలను కూడా చేర్చాలి. ఇటువంటి దుర్వినియోగం వల్ల సహ చట్టం ఉనికికే ప్రమాదం వస్తుంది. మంచి పాలన కోసం ఆర్టీఐని వినియో గించాలి. సహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పనిచేయని, పనికిరాని ఉద్యోగులు సంస్థకు, ఈ చట్టానికి తీరని కీడు చేస్తారు. వీరిని ఉపేక్షించకూడదు. వీరిపైన క్రమశిక్షణా చర్య తీసుకోవాలి. ఒక కళాశాలలో బాగా చదువుకున్న ఒక మహిళా ఉపా ధ్యాయురాలు పాఠాలు చెప్పకుండా పక్కవారిని వేధిస్తుంటే సక్రమంగా నోటీసు ఇచ్చి విచారణ జరిపి, వారి దుర్మార్గాన్ని రుజువు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. ఆ పని చేయవచ్చు కాని పగబట్టి స్వార్థంతో ఆర్టీఐని దుర్విని యోగం చేయడానికి వీల్లేదు. పదవీ విరమణ చేసిన వృద్ధ ఉద్యోగి ఒకరు తనకు ఇరవై ఏళ్ల కిందట ప్రమోషన్ రాలేదనే కసితో వరసబెట్టి ఆర్టీఐ వాడసాగాడు. సమాచార కమిషన్ అతని దరఖాస్తులను కట్టగట్టి సమిష్టిగా విచారించి తిరస్కరించింది. ఇతని దుర్మా ర్గాన్ని దుష్ర్పవర్తనగా భావించి క్రమశిక్షణా చర్య తీసుకో వచ్చని, అందుకు సంబంధించిన నియమాలు రూపొం దించాలని కమిషన్ సూచించింది. (CIC/BS/A/2014/002319-SA, CIC/SA/A/2015/002028 కేసుల్లో సీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
అలా చేయడం తప్పా?!
జీవన గమనం నేనో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. నాకు ఎవరైనా రూల్స్ పాటించకపోతే నచ్చదు. ఆఫీసులో కొలీగ్స్ నుంచి రోడ్డు మీద ఆటోవాడి వరకూ ఎవరు నియమాలు తప్పినా సహించ లేను. అలా చేయడం తప్పు కదా అని నిలదీసి అడిగేస్తాను. అది ఎవరికీ నచ్చదు. నీకు అవసరమా అంటారు. తనే పెద్ద సిన్సియర్ అయినట్టు అని కొందరు ఎగతాళి కూడా చేస్తున్నారు. నేనిలా చేయడం తప్పా? - శంకర్రావు, జీడిమెట్ల సమాజంలో జరుగుతోన్న అక్రమా లను చూసి ఆవేశం రావడం, రక్తం మరగడం సాధారణమే. అయితే ‘పరిస్థితి అలా తయారవడానికి మనం కూడా దోహదపడుతున్నామా’ అనే విషయం ఆలోచించుకోవాలి. దీన్నే ఇంగ్లిష్‌లో ‘సెల్ఫ్ రియలైజేషన్’ అంటారు. ఉదాహరణకి రోడ్డు పక్కన చెత్త చూసి, మీరు ప్రభుత్వం మీద కోపం తెచ్చుకున్నారనుకుందాం. ఇంట్లోని చెత్త మీరెప్పుడైనా రోడ్డుమీద పడేశారా అన్నది ఆలోచించుకోవాలి. సినిమాలో లంచగొండి పోలీసు అధికారి మీద హీరో ఉమ్మేసినప్పుడు ప్రేక్షకులంతా చప్పట్లు కొడతారు. చిత్రమేమిటంటే, వాళ్లలో చాలామంది లంచగొండులు ఉంటారు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి ఆటోవాడు రెట్టింపు చార్జీ అడిగితే, కోపం రావడం సహజమే. ఎందుకంటే మీ బల హీనతతో అతడు ఆడుకుంటున్నాడు కాబట్టి. అయితే పాస్‌బుక్ కోసం ఒక రైతు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు లంచం అడిగితే, ఇతరుల బలహీనతలతో ఆడు కునే వారిలో మీరు కూడా ఒకరవుతారు. అప్పుడు మీకు ఆటోడ్రైవర్ మీద కోపం తెచ్చుకునే అధికారం లేదు. ఇలా ఆలో చిస్తే, మనలో కూడా అవే లోపాలుంటే, ఆవేశం తగ్గిపోతుంది. లేదూ మీరు సిన్సియర్‌గా ఉన్నారంటే... ఓ మంచి అభిరుచిని ఏర్పరచుకోండి, ఆవేశం అదే తగ్గుతుంది. సమాజంలో ఏఏ పరిస్థితుల వల్ల ఉద్వేగం కలుగుతోందో వ్యాసాలుగా రాసి పత్రికలకి పంపండి. ఫేస్బుక్లో పోస్టులు, బ్లాగులు పెట్టడం కూడా ఓ పద్ధతి. దీన్నే ‘ఔట్-లెట్’ అంటారు. అంతర్గత ఆవేశానికీ ఉద్విగ్నతకీ కారణ మైన పరిస్థితుల పట్ల ప్రతిస్పందించ డానికి చాలామంది కళాకారులు ఎన్నుకునే పద్ధతి ఇది. మంచి ఫలితం ఉంటుంది. కులమతాలు పట్టించుకోకుండా, కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లాడాను. పదేళ్లు కాపురం చేసి, బాబు పుట్టాక ఆమె అక్రమ సంబంధాల వైపు పరుగెత్తింది. నేను వ్యతిరే కించినా విడాకులు సాధించుకుంది. వేరొక రితో సహజీవనం చేస్తోంది. నేను మా కుటుం బీకుల ప్రోత్సాహంతో ఓ డైవర్సీని పెళ్లాడాను. ఆవిడకు ఎదిగిన కూతురుంది. ముగ్గురం అన్యోన్యంగా ఉంటున్నాం. అయితే నా మొదటి భార్య మా బాబుని నాకు దూరం చేసింది. వాడికి నాపై చెడు అభిప్రాయాన్ని పెంచి నా దగ్గరకు రాకుండా చేసింది. అది నేను తట్టుకో లేకపోతున్నాను. ఏం చేయాలి? - ఓ సోదరుడు, బెంగళూరు మీరు అడిగిన ప్రశ్నకి మొదటి ఐదు వాక్యాలూ అవసరమా? ‘నేను చాలా గొప్ప పని చేశాను, నా భార్య నీచమైన మనస్తత్వం కలది’ అన్న అభిప్రాయం మీ ప్రశ్నలో ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి భార్యను వదిలేసినప్పుడు ఆమెతో పాటు మానసికంగా మీ బాబును కూడా వది లేయడానికి సిద్ధపడాలి. మీ రెండో భార్య మాజీ భర్త ఆమెనీ, ఆమె కూతుర్నీ కొంత కాలం తన దగ్గరకు పంపించమంటే మీరు ఎలా ఫీలవుతారో, బహుశా మీ మొదటి భార్య కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మీరిప్పుడు అన్యోన్యంగానే ఉన్నారు కాబట్టి మొదటి భార్యతో బంధం పూర్తిగా తెంచుకోండి. జిలేబి తింటూ డయాబెటిస్ తగ్గాలంటే ఎలా? మోహం ఎక్కువైతే వ్యామోహం అంటారు. వ్యామోహం ఎక్కువైతే తాపత్రయం అంటారు. తాపం అంటే కోరిక. త్రయం అంటే మూడు. ‘నేను బావుండాలి, నన్ను బాగా ఉంచడం కోసం అవతలివారు బాధపడినా నేను బావుండాలి, నేను పోయాక కూడా నావాళ్లు (మాత్రమే) బావుండాలి’ అనే మూడు కోరికలే తాప త్రయం. ఇదే అన్ని విషాదాలకీ మూలం. నేనో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఓ క్యాబ్ డ్రైవర్ నన్ను రెగ్యులర్‌గా డ్రాప్ చేసే వాడు. తను నన్ను ప్రేమించాడు. మొదట కాదన్నా నన్ను దేవతలాగా చూడటం చూసి నేనూ ప్రేమించాను. మావాళ్లు ఒప్పుకున్నారు. కానీ ఉద్యోగాలు, స్తోమత కారణంగా తేడాలు వస్తాయంటూ తన ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. అప్పుడే నాకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో వెళ్లాల్సి వచ్చింది. తర్వాత కూడా ఇద్దరం టచ్‌లో ఉన్నాం. పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారని తను చెబితే ‘వెయిట్ చేస్తే చెయ్యి, లేదంటే తననే చేసుకో’ అన్నాను. కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఎన్నిసార్లు చేసినా దొరక లేదు. చాలా రోజులు ప్రయత్నించి, తన ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ చేస్తే తనకి పెళ్లైపోయిందని చెప్పారు. నంబర్ అడిగితే నాకు ఇవ్వొద్దన్నా డని అన్నారు. నా గుండె పగిలిపోయింది. తను లేకుండా నేను బతకలేను. తనని నేను మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? - ప్రియాంక, ఆస్ట్రేలియా అతడిని మర్చిపోవడం తప్ప మీకింకో మార్గం ఏముంది చెప్పండి! రంభ తా వలచి వచ్చిన అనే సామెత గుర్తుందిగా! మీరు దేబిరించేకొద్దీ అతనికి మీమీద ప్రేమ తగ్గడమే కాకుండా అసహ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీరు అతడిని మర్చిపోవడమే మంచిది. గుండెలు పగలటాలూ, మళ్లీ అతుక్కోవడాలూ మామూలే. కాలమే అన్ని గాయాలనూ మానేలా చేస్తుంది. కొంతకాలం ఇతర అభిరుచుల్లో నిమగ్నమైతే మనసు సర్దు కుంటుంది. జీవితాన్ని ఎప్పుడు కావా లంటే అప్పుడు ఫ్రెష్‌గా ప్రారంభించ వచ్చు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఆనందంగా ఉండగలరు. - యండమూరి వీరేంద్రనాథ్ -
ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే...
♦ నేనో కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. టీమ్ లీడర్ని కావడంతో చాలా ప్రెజర్ ఉంటుంది. టార్గెట్ రీచ్ కావాలన్న తపనతో ఒక్కోసారి నా కింద పని చేసేవాళ్ల మీద ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతూంటుంది. కానీ దాన్ని మా టీమ్ అపార్థం చేసుకుంటు న్నారు. నేను వాళ్లని హింసిస్తున్నానని అనుకుంటున్నారు. వాళ్లలా అనుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో తెలియజేయండి? - మానస, హైదరాబాద్ కార్పొరేట్ రంగంలోని ఒత్తిడి వల్ల చాలామంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సెల్ఫ్ కంట్రోల్, మనుషుల్ని డీల్ చేయడం, టైమ్ మేనేజ్మెంట్ తెలిస్తే ఈ సమస్యను తేలికగా పరిష్కరించుకోవచ్చు. మీ కొలీగ్స్ మీలో ఏయే లక్షణాలు ఇష్టపడటం లేదు, ఏ కారణాల వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఆ లక్షణాల్లో మార్పు చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొలీగ్స్‌తో మాట్లాడేటప్పుడు వాయిస్ పెంచకుండా నెమ్మదిగా మాట్లాడండి. ఇది అందరి లక్ష్యం, అందరం కలిసి నెరవేర్చుకుందాం అంటూ వారిని మీతో కలుపుకుని మాట్లాడండి. ఎప్పుడూ పని గురించే కాకుండా అప్పుడప్పుడూ కాస్త సరదాగా కబుర్లు కూడా చెబుతుండాలి. వారి వ్యక్తిగత జీవితం గురించి కూడా మంచి చెడులు మాట్లాడుతూ, మీరు సంతోషంగా ఉండటం నాకు అవసరం అన్నట్లు మీరు ప్రవర్తిస్తే వారు తప్పక మీకు దగ్గరవుతారు. ♦ నేను ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రతి రిటెన్ టెస్ట్‌లో మంచి మార్కులు సంపాదిస్తాను. కానీ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికే వస్తుంది సమస్య. వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం నాకు తెలిసే ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా దాన్ని వెలిబుచ్చలేను. తడబడుతుంటాను. తప్పులు మాట్లాడతాను. దాంతో ప్రతిసారీ అవకాశాన్ని కోల్పోతున్నాను. ఎంతగా ప్రిపేర్ అయి వెళ్లినా ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమించాలి? - మనోహర్, విశాఖపట్నం మనోహర్గారూ... ఈ సమస్య చాలామందిలో సహజంగానే ఉంటుంది. దీనికే పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. ఇది సోషల్ ఫోబియాలో ఒక భాగం. ఒక పని చేస్తున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందా అని ఆలోచించి భయపడటం వల్ల ఫలితం ఎప్పుడూ నెగిటివ్‌గానే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూల్లో ఫెయిల్ కావడానికి కూడా కారణం అదే. నా సమాధానాలు అవతలివారికి నచ్చుతాయో లేదో, ఇంటర్వ్యూ ఫలితం ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచించి టెన్షన్ పడటం వల్ల సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. దీనిని నెగిటివ్ ఇమాజినేషన్ అంటారు. దీనివల్ల మనిషి ఆలోచనల మీద నియంత్రణ కోల్పోతాడు. మనసులో ఉన్నదాన్ని బయటకు వెలి బుచ్చలేకపోతాడు. నోరు ఎండిపోవడం, చేతులకు చెమటలు పట్టడం, గుండె వేగం హెచ్చడం వంటి లక్షణాలతో ఉక్కిరిబిక్కిర వుతాడు. కాబట్టి ముందు మీరు మీ ఆలోచనా పద్ధతిని మార్చుకోవాలి. జీవితంలో అవకాశాలనేవి వస్తూనే ఉంటాయి, ఈ ఇంటర్వ్యూయే జీవితం కాదు అన్నట్టుగా ఆలోచించాలి. దానివల్ల మీ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతారు. ♦ నేనో గృహిణిని. నాకు నా కుటుంబ మంటే ప్రాణం. కానీ ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతుంటాను. పిల్లల మీద కూడా బాగా అరిచేస్తాను. దాంతో నాకు కోపం ఎక్కువన్న ముద్ర పడిపోయింది. ముక్కు మీదే ఉంటుంది కోపం అని అందరూ అంటుంటే మనసు చివుక్కు మంటుంది. నిజానికి నేను అంతగా కోప్పడుతున్నానన్న విషయం నాక్కూడా తెలియదు. నామీద పడిన కోపిష్టి అన్న ముద్రనెలా పోగొట్టుకోవాలి? - విజయ, కరీంనగర్ కోపం అనేది విపరీతమైన ఒత్తిడి వల్లో, మానసికంగా బలహీనపడటం వల్లో కూడా వస్తుంది. మీరు గృహిణిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఒత్తిడికి లోనవడం వల్ల ఈ సమస్య వచ్చింది. మీరు కుటుంబానికే కాదు, మీకోసం కూడా కొంత సమయం కేటాయించండి. రిలాక్స్ అవ్వండి. అలాగే మీకు ఏయే విషయాల్లో కోపం వస్తోందో లిస్ట్ రాసుకోవడం వల్ల మీ బలహీనతలు, విసుగులు మీకు అర్థమవుతాయి. తద్వారా కోపం తగ్గించుకోవ డానికి ప్రయత్నం చేయవచ్చు. కోపం వచ్చినప్పుడు మనసును వేరేవైపు మళ్లించి, మీకిష్టమైన ఏదో ఒక పని చేయండి. పుస్తకాలు చదవడమో, సంగీతం వినడమో చేయండి. ఒత్తిడి అదే తగ్గిపోతుంది. మెల్లగా మీవాళ్ల మనసుల్లో మీ మీద పడిన ముద్ర కూడా తొలగి పోతుంది. ఇది చిన్న సమస్య. మీరు తేలిగ్గా అధిగమిస్తారు. దిగులుపడకండి.