తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చూపిన చొరవతో హైదరాబాద్ నుంచి ఓ విమాన సర్వీసు పునః ప్రారంభం కానుంది. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడం ద్వారా టూరిజం అభివృద్ధికి జరుతుంది అంటూ గవర్నర్ పలు మార్లు రిక్వెస్ట్ చేయడంతో పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది.
లాక్‌డౌన్‌తో
కరోనా సంక్షోభం చుట్టుముట్టగానే లాక్‌డౌన్ అనివార్యంగా మారింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరం నుంచి 2020 మార్చి 24 నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కొన్ని సర్వీసులు స్టార్ అయ్యాయి. అయితే హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి నడిచే ప్లైట్ పునః ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సర్వీసుతో నష్టాలు వస్తుండటంతో ఎయిర్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ లేఖ
హైదరాబాద్ పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాల్లో టూరిజం సెక్టార్ మేలు జరుగుతుందంటూ కేంద్రాన్ని కోరారు గవర్నర్ తమిళసై. పుదుచ్చెరికి సమీపంలో ఉన్న వెలాంగిని చర్చ్, నాగోర్ దర్గా, తిరునల్లార్ శనీశ్వరాలయం, మహాబలిపురం వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుందంటూ విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశారు.
వీజీఎఫ్ సర్థుబాటు
గవర్నర్ తమిళసై రిక్వెస్ట్‌తో రంగంలోకి దిగిన ఏవియేషన్ శాఖ ఎయిర్ ఆపరేటర్లతో చర్చించింది. హైదరాబాద్ - పుదుచ్చేరి సర్వీసు బ్రేక్ ఈవెన్ సాధించే వరకు వ్యాయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) సర్థుబాటు చేస్తామంటూ హమీ ఇచ్చింది. దీంతో సంక్రాంతి పండగ నుంచి హైదరాబాద్ - పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు స్పైస్‌జెట్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.
పుదుచ్చెరీ సైతం
మరోవైపు పుదుచ్చేరి సర్కారు సైతం తమ రాష్ట్రం నుంచి బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, రాజమండ్రి నగరాలకు విమాన సర్వీసులు నడిపించాల్సిందిగా ఇండిగో సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. వీజీఎఫ్ సర్థుబాటు చేయడంతో పాటు వ్యాట్ ఫ్రీ ఏవియేషన్ ఫ్యూయల్ అందిస్తామంటూ తెలిపింది. అయితే ఇండిగో నుంచి ఇంకా స్పష్టమైన నిర్ణయం రాలేదు.
చదవండి: ఆ పది మంది సంపాదన 400 బిలియన్ డాలర్లు! ఈ ఒక్క ఏడాదిలోనే..
Comments
Please login to add a commentAdd a comment