puduccheri
-
కాటన్ క్యాండీలపై నిషేధం.. వీడియో విడుదల చేసిన తమిళిసై!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్ క్యాండీలను తయారు చేస్తున్నారనే కారణంతోనే వీటిపై నిషేధం విధించారు. ఒక వీడియోలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నారన్నారు. కాటన్ క్యాండీలలోని విష రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. అందుకే పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. குழந்தைகளின் உடல்நலத்தை பாதிக்கும் ரசாயனம் கலந்த பஞ்சு மிட்டாயை குழந்தைகளுக்கு வாங்கி கொடுக்காதீர்கள்.#CottonCandy #PanchuMittai #Puducherry pic.twitter.com/VJR451Y403 — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 8, 2024 లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం, రోడోమైన్ బీ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. -
నా వల్ల కాదు.. మంత్రి పదవికి ప్రియాంక రాజీనామా
చెన్నై: పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి చందిర ప్రియాంగ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు డబ్బు, కుట్రలతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చందిర ప్రియాంక తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రికి రంగస్వామికి లేఖ పంపారు. కాగా, లేఖలో ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని, డబ్బుమయంగా మారిపోయాయని అన్నారు. రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని, లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'Could not fight ghost of money power':Puducherry's lone woman legislator and minister, S Chandira Priyanga quits. Watch: https://t.co/C5eaBYqTif pic.twitter.com/2Oq5N5CsPX — editorji (@editorji) October 10, 2023 అలాగే, పుదుచ్చేరిలో రెండు ప్రధాన వర్గాలుగా వన్నియర్లు, దళితులు ఉన్నారని, ఈ వర్గాలకు చెందిన శాసనసభ్యులు తమ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ వర్గాలు మరింత అభివృద్ధి చెందేందుకు, అవినీతి రహిత రాజకీయాల కోసం తన పదవిని వన్నియర్లు లేదా దళితులు లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. pic.twitter.com/5lejQf9uHy — Chandirapriyanga (@SPriyanga_offl) October 10, 2023 ప్రజల మద్దతు లేకపోయినా ధన బలమున్న వారికి ఈ పదవి ఇచ్చి ద్రోహం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేయాలని అభ్యర్థించారు. ఇక, ఆమె రాజీనామాపై స్పందించేందుకు ముఖ్యమంత్రి రంగస్వామి నిరాకరించారు. ప్రియాంగ రాజీనామాపై అడిగేందుకు ఆయన చాంబర్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆహ్వానించకుండా ఎందుకు వచ్చారని వారిపై సీరియస్ అయ్యారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ పోరు.. భారత్‌కు కొత్త సవాల్! -
ఆ ప్రాంతంలో పోలీసులకు ఎర్రని టోపీలు... కారణం ఇదే!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పోలీసుల యూనిఫారం విభిన్నంగా ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. అయితే చాలా రాష్ట్రాల్లో పోలీసుల యూనిఫారం ఖాకీ రంగులోనే ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలోని పోలీసుల యూనిఫారం మరింత విభిన్నంగా ఉంటుంది. అక్కడి పోలీసులు తలపై ఎర్రని రంగు టోపీ ధరిస్తారు. ఇటువంటి టోపీని ఏ రాష్ట్రంలోనూ ధరించరు. ఈ టోపీ తయారీ కూడా ఇతర టోపీల కన్నా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తరహాలోని టోపీని పెట్టుకున్న పోలీసులను ఎంత దూరం నుంచి అయినా ఇట్టే గుర్తించవచ్చు. అయితే అక్కడి పోలీసులు ఎర్రని టోపీని ఎందుకు ధరిస్తారు? ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన చాలా ఏళ్ల తరువాత పుదుచ్చేరికి స్వాతంత్య్రం లభించింది. తరువాత అది భారత్‌లో భాగమయ్యింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించగా, పుదుచ్చేరి మాత్రం ఫ్రాన్స్ ఆధీనంలోనే ఉంది. అక్కడ ఫ్రాన్స్ న్యాయవ్యవస్థనే కొనసాగింది. అయితే 1954లో పుదుచ్చేరి భారత్‌లో విలీనమయ్యింది. అప్పటి నుంచి అక్కడ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దీని తరువాత పుదుచ్చేరిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు ధరించే ఎరుపు రంగు టోపీ విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. ఫ్రాన్స్ పోలీసులు ఎరుపురంగు టోపీని ధరిస్తారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు ఎరుపురంగు టోపీ ధరించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఎరుపు రంగు టోపీని ఇక్కడి పోలీసు విభాగంలోని ఉన్నతాధికారులు ధరించరు. కేవలం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే వీటిని ధరిస్తారు. అయితే వీరి టోపీలలో ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. కానిస్టేబుల్ ధరించే టోపీపై నలుపు రంగు గీత కనిపిస్తుంది. హెడ్‌కానిస్టేబుల్ టోపీపై పసుపు రంగు గీతలు కనిపిస్తాయి. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు -
ఆ రాష్ట్రానికి విమాన సర్వీసు నడిపించండి.. తెలంగాణ గవర్నర్ తమిళసై రిక్వెస్ట్
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చూపిన చొరవతో హైదరాబాద్ నుంచి ఓ విమాన సర్వీసు పునః ప్రారంభం కానుంది. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడం ద్వారా టూరిజం అభివృద్ధికి జరుతుంది అంటూ గవర్నర్ పలు మార్లు రిక్వెస్ట్ చేయడంతో పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది. లాక్‌డౌన్‌తో కరోనా సంక్షోభం చుట్టుముట్టగానే లాక్డౌన్ అనివార్యంగా మారింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరం నుంచి 2020 మార్చి 24 నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కొన్ని సర్వీసులు స్టార్ అయ్యాయి. అయితే హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి నడిచే ప్లైట్ పునః ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సర్వీసుతో నష్టాలు వస్తుండటంతో ఎయిర్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ లేఖ హైదరాబాద్ పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాల్లో టూరిజం సెక్టార్ మేలు జరుగుతుందంటూ కేంద్రాన్ని కోరారు గవర్నర్ తమిళసై. పుదుచ్చెరికి సమీపంలో ఉన్న వెలాంగిని చర్చ్, నాగోర్ దర్గా, తిరునల్లార్ శనీశ్వరాలయం, మహాబలిపురం వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుందంటూ విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశారు. వీజీఎఫ్ సర్థుబాటు గవర్నర్ తమిళసై రిక్వెస్ట్‌తో రంగంలోకి దిగిన ఏవియేషన్ శాఖ ఎయిర్ ఆపరేటర్లతో చర్చించింది. హైదరాబాద్ - పుదుచ్చేరి సర్వీసు బ్రేక్ ఈవెన్ సాధించే వరకు వ్యాయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) సర్థుబాటు చేస్తామంటూ హమీ ఇచ్చింది. దీంతో సంక్రాంతి పండగ నుంచి హైదరాబాద్ - పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు స్పైస్‌జెట్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పుదుచ్చెరీ సైతం మరోవైపు పుదుచ్చేరి సర్కారు సైతం తమ రాష్ట్రం నుంచి బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, రాజమండ్రి నగరాలకు విమాన సర్వీసులు నడిపించాల్సిందిగా ఇండిగో సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. వీజీఎఫ్ సర్థుబాటు చేయడంతో పాటు వ్యాట్ ఫ్రీ ఏవియేషన్ ఫ్యూయల్ అందిస్తామంటూ తెలిపింది. అయితే ఇండిగో నుంచి ఇంకా స్పష్టమైన నిర్ణయం రాలేదు. చదవండి: ఆ పది మంది సంపాదన 400 బిలియన్ డాలర్లు! ఈ ఒక్క ఏడాదిలోనే.. -
తెలంగాణ బాటలో తమిళనాడు,పుదుచ్చేరి
-
గవర్నర్‌ను డమ్మీగా ఉండాలంటున్నారు!
హైదరాబాద్: పుదుచ్చేరి ప్రభుత్వం తానొక డమ్మీగా ఉండాలని కోరుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కిరణ్ బేడీకి విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్ ఈక్వెష్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసేవరకు ఉండాలని అనుకోవటం లేదని ఆమె చెప్పారు. ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం పలు చర్యలు తీసుకున్నానని తెలిపారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని ఆరోపించారు. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కిరణ్ బేడి అన్నారు.