సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం రైల్వే మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖలకు షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో..ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సదరు టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాలను తొలగించకపోవడంపై వివరణ కోరుతూ బుధవారం లేఖలు రాసింది. రైలు టికెట్లు, ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్‌లపై ప్రధాని మోదీ చిత్రాలను ఎందుకు తొలగించలేదని ఎన్నికల సంఘం ఈ రెండు ప్రభుత్వ శాఖలను ఈసీ ప్రశ్నించింది. ఈ అంశాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మంత్రిత్వ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
కాగా కేంద్ర ఎన్నికల సంఘం 2019 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం మార్చి 10వ తేదీనుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రవర్తనా నియమావళి ప్రకారం, రాజకీయ నాయకుల ఫోటోలు, వారి పేర్లు, పార్టీ చిహ్నాలను ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రచారం చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment