![Election Commissioners Meeting On Ashok Lavasa Issue - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/21/sunil-aurora.jpg.webp?itok=s5uDLbtR)
సీఈసీ సునీల్ అరోరా
సాక్షి, న్యూడిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఈసీలో అసమ్మతి రేగిన సంగతి తెలిసిందే. ఈసీ పనితీరుపై కమిషనర్ అశోక్ లావాసా అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదులపై మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయడం లేదని పేర్కొంటూ ఆయన సీఈసీ సునీల్ అరోరాకు లేఖ కూడా రాశారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో మైనారిటీ అభిప్రాయాల్ని కూడా గౌరవించాలని, చర్యలు తీసుకునే విషయంలో పారదర్శకత పాటించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
(చదవండి : ఈసీలో అసమ్మతి ‘లావా’సా)
కాగా, లవాస వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. ఎన్నికల కోడ్‌కు సంబంధించిన అంశాలపై మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని సీఈసీ సునీల్ అరోరా అభిప్రాయపడినట్టు తెలిసింది. కేవలం క్వాసీ-జ్యూడిషియల్ వ్యవహారాల్లో మాత్రమే మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని సీఈసీ అభిప్రాయపడినట్టు సమాచారం. ముగ్గురు ఈసీ కమినర్ల బృందంలో లావాసా ఒకరు కాగా, సీఈసీ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్ర ప్రధాని మోదీకి క్లీన్‌చిట్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండగా.. లావాసా వ్యతిరేకించారు.
Comments
Please login to add a commentAdd a comment