ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిరిండియా బోర్డింగ్ పాస్‌లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మల వివాదంపై శనివారం మరోసారి నోటీసులు జారీ చేసింది. టికెట్లపై మోదీ బొమ్మలను ఇంకా ఎందుకు తొలగించలేదని ఈసీ ప్రశ్నించింది. దీనిపై ఈ రోజే సమాధానం ఇవ్వాలంటూ రెండవ సారి నోటీసులిచ్చింది.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతోరైల్వేటికెట్లు, ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా జారీ చేసే బోర్డింగ్ పాస్‌లపై ప్రధాని ఫోటోలను తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
చదవండి : ప్రధాని మోదీ బొమ్మలపై ఈసీ కన్నెర్ర
Comments
Please login to add a commentAdd a comment