
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: విమాన ప్రయాణంలో మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి బిత్తిరి చర్యకు పాల్పడ్డాడు. తోటి ప్రయాణికురాలి సీట్లో మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన గత గురువారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. బాధితురాలి కూతురు ఇంద్రాణి ఘోష్ శుక్రవారం ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ‘నాతల్లి ఒంటరిగా ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణంగా ప్రవర్తించాడు. ఆమె సీట్లలో మూత్ర విసర్జన చేశాడు’అని పేర్కొంటూ విమానయాన శాఖ, విదేశాంగ శాఖ మంత్రులతో పాటు ఎయిరిండియాకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై విమానయాన మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. అయితే ఎయిరిండియా సిబ్బంది మాత్రం కేవలం సీటు మాత్రమే మార్చిందని, నిందితుడిని పట్టించుకోలేదని ఇంద్రాణి వాపోయింది. ఫ్లైట్ దిగిననంతరం నిందితుడు నడుచుకుంటు వెళ్లిపోయాడని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment