
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మరో ఆరు ఎయిర్‌పోర్టుల ఏర్పా టుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment