నెగిటివ్‌ రిపోర్టు క్యూఆర్‌ కోడ్‌ ఉంటేనే ఎంట్రీ | Negative RT PCR Report With QR Code Mandatory for International Travellers from Today | Sakshi
Sakshi News home page

నెగిటివ్‌ రిపోర్టు క్యూఆర్‌ కోడ్‌ ఉంటేనే ఎంట్రీ

Published Sat, May 22 2021 1:53 PM | Last Updated on Sat, May 22 2021 2:43 PM

Negative RT PCR Report With QR Code Mandatory for International Travellers from Today - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌ నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై ఆంక్షలు కఠినతరం చేశాయి విదేశాలు. ఇకపై ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌కి అనుసంధానంగా ఉన్న క్యూర్‌కోడ్‌ చూపిస్తేనే ఎంట్రీకి అనుమతి ఇస్తున్నాయి. క్యూఆర్‌ కోడ్‌ లేకుండా చూపించే కోవిడ్‌ 19 నెగటివ్ రిపోర్టులను తిరస్కరిస్తున్నాయి. దీంతో మే 22 అర్థరాత్రి నుంచి విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తమతో పాటు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ నెగటివ్‌ రిపోర్టుకి అనుసంధానంగా ఉండే క్యూఆర్‌ కోడ్‌ను వెంట ఉంచుకోవాలంటూ పౌరవిమానయాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రయాణికుల్లో కొందరు నకిలీవీ, ఫోటోషాప్‌ చేసిన ఆర్టీ పీసీఆర్‌ రిపోర్టులు తీసుకెళ్లారు. విదేశాల్లోని చెక్‌పాయింట్ల వద్ద వారు పట్టుబడ్డారు. దీంతో పేపర్‌ రిపోర్టులకు బదులు ఒరిజినల్‌ కోవిడ్‌ రిపోర్టుకి అనుబంధంగా ఉండే క్యూఆర్‌ కోడ్‌ని తప్పనిసరి చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement