విమానాల ఆలస్యంతో ప్రయాణికుల పాట్లు | Flittings passenger aircraft delay | Sakshi

విమానాల ఆలస్యంతో ప్రయాణికుల పాట్లు

Published Tue, Aug 23 2016 12:07 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

విమానాల ఆలస్యంతో ప్రయాణికుల పాట్లు - Sakshi

విమానాల ఆలస్యంతో ప్రయాణికుల పాట్లు

  • నాలుగైదు గంటల జాప్యం
  • పోర్టుబ్లెయిర్, దిల్లీ ప్రయాణికుల అసౌకర్యం
  • గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి సోమవారం పలు విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దిల్లీ నుంచి విశాఖకు ఉదయం 9.20 గంటలకు రావలసిన ఎయిరిండియా విమానం మధ్యాహ్నం 1.50కి వచ్చింది. ఇది పోర్టుబ్లెయిర్‌కి 12.05కి వెళ్లాల్సి ఉండగా, సాయంత్రం 4.20కి బయలుదేరింది. పోర్టుబ్లెయిర్‌ నుంచి విశాఖకు సోమవారం మధ్యాహ్నం 2.55కి రావలసిన ఎయిరిండియా విమానం రాత్రి ఏడు గంటలకు వచ్చింది. షెడ్యూలు ప్రకారం తిరిగి  దిల్లీకి సాయంత్రం 6.10కి బయల్దేరాల్సిన సర్వీసు 9.10కి దిల్లీకి బయల్దేరింది. దీంతో దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులు ఆవేదన చెందారు. విమానానికి సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణాలు ఆలస్యంగా సాగినట్లు తెలిసింది. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement