చైనా స్పై విమానం
బీజింగ్: సముద్రాల్లో విమాన వాహక నౌకల నుంచి నియంత్రించగలిగే కొత్త గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. శత్రు దేశాల డ్రోన్లు, జెట్‌ల కదలికలను కనిపెట్టడానికి వీలుగా దీనికి ఏఈఎస్‌ఏ రాడార్‌ను అమర్చారు. కేజే–600 అనే పేరుగల ఈ గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధిపరుస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సోమవారం తొలిసారిగా బయటపెట్టిందంటూ హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
చైనా సముద్ర జలాల్లో ఇప్పటికే రెండు విమాన వాహక నౌకలు సేవలందిస్తుండగా, మూడో దానిని షాంఘైలో నిర్మిస్తోంది. తాజాగా అభివృద్ధి చేస్తున్న గూఢచర్య విమానాలను మూడో విమాన వాహక నౌకపై మోహరించే అవకాశం ఉన్నట్లుæ పత్రిక పేర్కొంది. గగనతలంలో అమెరికాకు దీటుగా తన సామర్థ్యాలను పెంపొందించుకునేందుకే కేజే–600ను చైనా నిర్మిస్తోందని సమాచారం. దీనిని దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలో మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment