ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంఆర్‌వో సేవల్లోకి స్టార్‌ ఎయిర్‌ | Star Air To Enter Into Aircraft MRO Services | Sakshi
Sakshi News home page

ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంఆర్‌వో సేవల్లోకి స్టార్‌ ఎయిర్‌

Jan 28 2025 9:19 PM | Updated on Jan 28 2025 9:19 PM

Star Air To Enter Into Aircraft MRO Services

ముంబై: ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్‌ ఎయిర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంఆర్‌వో సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. 2019లో ప్రారంభమైన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. మార్చి నాటికి ఫ్లీట్‌ సంఖ్య 14కు చేర్చనున్నట్టు వెల్లడించింది. అలాగే సర్వీసుల సంఖ్యను 100కు పెంచనున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం సంస్థ వద్ద ఎంబ్రాయర్‌ తయారీ తొమ్మిది విమానాలు ఉన్నాయి. 23 కేంద్రాలను అనుసంధానిస్తూ రోజుకు 44 సర్వీసులను నడుపుతోంది. 15 లక్షల మందికిపైగా కస్టమర్లకు సేవలు అందించింది. ఉడాన్‌ స్కీమ్‌ కింద కంపెనీకి కేటాయించిన రూట్లలో 90 శాతంపైగా కవర్‌ చేసినట్టు స్టార్‌ ఎయిర్‌ సీఈవో సిమ్రాన్‌ సింగ్‌ తివానా తెలిపారు. నెట్‌వర్క్‌కు మరో అయిదు కేంద్రాలు తోడు కానున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement