రోల్స్‌రాయ్స్‌: గంటకు 623 కిలోమీటర్లు.. | Rolls Royce Says Its All Electric Aircraft Is World Fastest | Sakshi
Sakshi News home page

రోల్స్‌రాయ్స్‌: గంటకు 623 కిలోమీటర్లు..

Published Tue, Nov 23 2021 12:37 AM | Last Updated on Tue, Nov 23 2021 7:37 AM

Rolls Royce Says Its All Electric Aircraft Is World Fastest - Sakshi

భూమిలో ఇంధనాలు అడుగంటిపోతుండటం, కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో.. వాహనాల తయారీదారులు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగింది. బైక్‌లు, కార్ల నుండి విమానాలకు చేరుకుంది. రోల్స్‌రాయ్స్‌... అందరికీ అత్యంత ఖరీదైన కార్ల కంపెనీగానే తెలుసు. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్‌ విమానాన్ని ఇటీవల పరీక్షించింది. ఈ సంస్థ తయారు చేసిన ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’ఆల్‌–ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ బోస్కోంబ్‌డౌన్‌ టెస్టింగ్‌ సైట్‌లో దీనిని పరీక్షించారు. టెస్ట్‌ ఫ్లైట్‌ను రోల్స్‌రాయ్స్‌ కంపెనీ ఫ్లైట్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ ఫిల్‌ ఓడెల్‌ నడిపారు. ఫ్లయింగ్‌ ట్యాక్సీస్‌ తమ భవిష్యత్‌ ప్రణాళిక అని చెబుతోంది రోల్స్‌రాయ్స్‌. 

‘రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగమే ఈ ఎలక్ట్రిక్‌ ప్లేన్‌’అని రోల్స్‌రాయ్స్‌ సీఈఓ వారెన్‌ ఈస్ట్‌ చెబుతున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ బిజినెస్, ఎనర్జీ అండ్‌ ఇండస్ట్రియల్‌ స్ట్రాటజీ మరియు ఇన్నోవేట్‌ యూకే భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సగం నిధులను బ్రిటీష్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ అందించింది. 

ప్రత్యేకతలు..  ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ 
విమానం. గంటకు 387.4 మైళ్ల (గంటకు 623 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం పాత రికార్డుకంటే... 132 మైళ్లు (212.5 కిలోమీటర్లు) ఎక్కువ. 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం ప్రత్యేకత.  

గతంలో ఉన్న రికార్డులు... 
గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 345 మైళ్లు (555.9 కిలోమీటర్ల), 15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 331 మైళ్లు (531.1 కిలోమీటర్లు), 202 సెకన్లలో మూడువేలమీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’బ్రేక్‌ చేసింది.  

బ్యాటరీ పనితీరు.. 
400 కిలోవాట్ల పవర్‌ బ్యాటరీ దీని సొంతం. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్‌ఫోన్లు పూర్తిగా చార్జ్‌ చేసేంత. సాధారణంగా వాషింగ్‌ మెషీన్స్‌లో ఉండే స్పిన్‌ 1000 ఆర్పీఎం ఉంటుంది. దానికి రెట్టింపు సామర్థ్యంతో ఈ విమానం ప్రొఫెల్లర్స్‌ తిరుగుతాయి. బ్యాటరీని కూల్‌గా ఉంచడం కోసం పోర్చుగీస్‌ కార్క్‌తో థెర్మల్‌ రక్షణ కవచం ఏర్పాటు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement