మాస్కో: రష్యా ఆకాశమార్గాన్ని ఖాళీ చేయిస్తోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో విమానాశ్రాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది. ఫ్లైట్ రాడార్ వెబ్‌సైట్ దీన్ని వెల్లడించింది. దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది.
అయితే సెయింట్‌పీటర్స్‌బర్గ్ గగనతలంలో గుర్తు తెలియని వస్తువు (అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- UFO)ను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశమార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విమానాశ్రాయానికి చేరుకోవాల్సిన విమానాలనకు వెనక్కి పంపించి.. యుద్ధ విమానాలకు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు 100 యుద్ధవిమానాలను సెయింట్‌పీటర్స్‌బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్ల సమాచారం.
అయితే ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వస్తువులు గగనతలంలో కన్పించడం కలకలం రేపడం తెలిసిందే. చైనాకు చెందిన భారీ బెలూన్లు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది. వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలో ఇప్పుడు యూఎఫ్‌ఓ కన్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏలియన్ల పనా? లేక ఇతర దేశాల పనా? అనే చర్చ కూడా మొదలైంది.
పుతిన్ సొంత నగరం..
అయితే రష్యా గగనతలంలో కన్పించింది ఓ భారీ డ్రోన్ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది నాటో దేశాల పని అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సొంతనగరం అయిన సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు. ఈ ఎయిర్‌పోర్టుకు 180 కిలోమీటర్ల దూరంలోనే భారీ డ్రోన్ కన్పించింది.
చదవండి: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
Comments
Please login to add a commentAdd a comment