St Petersburg
-
మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. -
రష్యాలో భారతీయ వైద్య విద్యార్థుల మృతి
మాస్కో: రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని ఓ నదిలో భారత్‌కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. వీళ్లంతా బతికే అవకాశం లేదని రెస్క్యూ టీం చెబుతోంది. ఇప్పటికే ఒక మృతదేహానికి వెలికి తీసింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది. మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందిన ఈ నలుగురు సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని నోవ్‌గొరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత నీటిలో మునిగిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోగా.. ఒక విద్యార్థిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు. విద్యార్థుల మృతదేహాల్ని వెలికి తీసి.. వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. -
ఆకాశాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా.. విమానాలన్నీ వెనక్కి.. ఏం జరుగుతోంది?
మాస్కో: రష్యా ఆకాశమార్గాన్ని ఖాళీ చేయిస్తోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో విమానాశ్రాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది. ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ దీన్ని వెల్లడించింది. దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సెయింట్‌పీటర్స్‌బర్గ్ గగనతలంలో గుర్తు తెలియని వస్తువు (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- UFO)ను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశమార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విమానాశ్రాయానికి చేరుకోవాల్సిన విమానాలనకు వెనక్కి పంపించి.. యుద్ధ విమానాలకు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు 100 యుద్ధవిమానాలను సెయింట్‌పీటర్స్‌బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్ల సమాచారం. అయితే ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వస్తువులు గగనతలంలో కన్పించడం కలకలం రేపడం తెలిసిందే. చైనాకు చెందిన భారీ బెలూన్లు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది. వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలో ఇప్పుడు యూఎఫ్ఓ కన్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏలియన్ల పనా? లేక ఇతర దేశాల పనా? అనే చర్చ కూడా మొదలైంది. పుతిన్ సొంత నగరం.. అయితే రష్యా గగనతలంలో కన్పించింది ఓ భారీ డ్రోన్ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది నాటో దేశాల పని అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సొంతనగరం అయిన సెయింట్ పీటర్స్బర్గ్కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు. ఈ ఎయిర్‌పోర్టుకు 180 కిలోమీటర్ల దూరంలోనే భారీ డ్రోన్ కన్పించింది. చదవండి: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! -
విరక్తిలో రష్యన్లు.. పుతిన్‌కు గడ్డుకాలం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్వదేశంలో చేదు అనుభవం ఎదురవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను రష్యన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పుతిన్ తీరును తప్పుబడుతూ వీధులు, రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు చెందిన సెలబ్రేటీలు, మీడియా ప్రముఖులు బహిరంగంగానే పుతిన్ చర్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి నిరసనగా వేల సంఖ్యలో రష్యన్లు బహిరంగ లేఖలు రాస్తున్నారు. దీంతో, అక్కడి పోలీసులు.. నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత మందిని అరెస్ట్ చేస్తారంటూ అసభ్యకర పదజాలంతో నిరసనలు తెలిపారు. మరోవైపు.. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో రష్యన్ భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. యుద్దంపై విరక్తితో వెంటనే దాడులను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యన్లు చాలా వరకు సేవలను కోల్పోతున్నారు. ఇక ఇటీవలే.. అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు సోమవారం ప్రకటించేసింది. ముప్ఫై ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతకుముందు అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలు.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ఆక్రమణ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన దాడులకు ఈరోజుతో మూడు నెలలు గడిచింది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చవిచూసింది. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌లోనే పెద్దదైన అజోస్తోవ్ స్టీట్ ప్లాంట్ తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా ప్రకటించింది. దీంతో, అక్కడ(మరియుపోల్‌లో) యుద్ధం ముగిసిందని రష్యా సైన్యం వెల్లడించింది. Not everyone in #Russia is falling for the Kremlin's lies. During a concert the crowd can be heard chanting "F*ck the war!" "They can't arrest us all!" Inspiring. Please share! 🚜🎼#PuckFutin #Putler#StandWithUkraine #activism #RussiaProtests #Ukraine #Putin #WarCrimes pic.twitter.com/YYg1xv6VPH — TACTICAL STRIKE MEDIA (@tsm3301) May 23, 2022 ఇది కూడా చదవండి: భారత్‌కు మాత్రమే అది సాధ్యమైంది.. వెల్డన్ మోదీ జీ -
అందరూ వదిలేయడంతో అనాథలా.. నటి ఆత్మహత్య
మంచి ఉద్యోగం-జీతం.. రెండింటినీ వదులుకుందామె. ఎవరూ ఊహించని రీతిలో పోర్న్ సినిమాల వైపు అడుగులేసింది. ఆ నిర్ణయంతో అయినవాళ్లకు దూరమైంది. చివరకు అనాథలా ఆత్మహత్యకు పాల్పడింది నటి క్రిస్టియానా లిసీనా. క్రిస్టియానా ‘క్రిస్ ది ఫాక్స్’ పేరుతో పాపులర్ అయిన రష్యన్ అడల్ట్ నటి. వయసు 29 ఏళ్లు. పోర్న్‌హబ్, ఓన్లీఫ్యాన్స్ సైట్ల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఆదివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ 22 అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చేతిలో కాయిన్ నేవ్స్కై పోలీసులు లిసీనా చేతిలో ఓ కాయిన్‌ను గుర్తించారు. దాని మీద ‘నువ్వెప్పుడు నా గుండెల్లో ఉంటావ్’ అనే కొటేషన్ ఉంది. అది తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశించి ఆమె రాసి ఉంటుందని భావిస్తున్నారు. చనిపోయే కాసేపటి ముందే ఆమె బిల్డింగ్‌లోకి ఎంటర్ అయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. గత కొంతకాలంగా లిసీనా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అభిమానులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఆమె మరణవార్త తెలియగానే ప్రియుడు రుస్తామ్.. సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఒంటరితనం భరించలేకే ఆమె చనిపోయిందని వాపోయాడు. క్రిస్టియానా అంత్యక్రియల కోసం సాయం చేయాలని కోరడంతో.. కొందరు ముందుకొచ్చారు కూడా. బ్యాంక్ జాబ్ వదిలి.. సైబీరియాకు చెందిన క్రిస్టియానా లిసీనా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆపై క్రాస్కోయార్స్క్లో బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఐదురోజులు మాత్రమే పని చేసిన ఆమె.. ఆసక్తి లేక అడల్ట్ సినిమాల వైపు మళ్లింది. దీంతో కుటుంబం ఆమెను వెలేయడంతో సెయింట్ పీటర్బర్గ్స్కు మకాం మార్చింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ.. కుదరలేదు. ఆమధ్య ఒంటరితనం తన పాలిట శాపమైందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయాన్ని.. ఇప్పుడు కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక ఆమె చనిపోయాక ఓన్లీఫ్యాన్స్ పేజీలో ఆమె పేరుతో ఉన్న అకౌంట్‌ను తొలగించారు. మిగతా సైట్లలోనూ ఆమె వీడియోలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
కాలభైరవా.. ఏం చేస్తివిరా!
కుక్క లేదా శునకం.. మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్లలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది. కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు. మనదేశంలో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావిస్తారు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది. ఇదీ కుక్కను గురించిన బ్రీఫ్‌గా చెప్పుకునే సమాచారం. ఇక కుక్కను కోట్‌చేసే సామెతలు, కథలంటారా.. కోకల్లలు! అలాంటివాటిలో ఒకటి ‘ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంది..’ అనే సామెత. ఈ ఫొటోల్లోని కుక్కల హంగామా చూస్తే సామెత సింక్ అయినట్లులేదూ! రష్యాలోని ప్రఖ్యాత సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 100కుపైగా కుక్కలు వెరైటీ డ్రస్సింగ్స్తో అదరగొట్టాయి. ఈజిప్ట్ స్పిన్క్స్( సింహిక)లా ఒకటి, కెప్టెన్ జాక్స్పారోలా మరొకటి, దెయ్యం వేషంలో ఇంకొకటి అలా అలా రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసి.. సారీ.. ‘డాగ్ వాక్’చేసి చూపరులను ఆకట్టుకున్నాయి.