మాస్కో: రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని ఓ నదిలో భారత్‌కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. వీళ్లంతా బతికే అవకాశం లేదని రెస్క్యూ టీం చెబుతోంది. ఇప్పటికే ఒక మృతదేహానికి వెలికి తీసింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది.
మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందిన ఈ నలుగురు సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని నోవ్‌గొరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత నీటిలో మునిగిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోగా.. ఒక విద్యార్థిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు.
విద్యార్థుల మృతదేహాల్ని వెలికి తీసి.. వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment