కాలభైరవా.. ఏం చేస్తివిరా!
కుక్క లేదా శునకం.. మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్‌లలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది. కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు. మనదేశంలో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావిస్తారు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది. ఇదీ కుక్కను గురించిన బ్రీఫ్‌గా చెప్పుకునే సమాచారం.
ఇక కుక్కను కోట్‌చేసే సామెతలు, కథలంటారా.. కోకల్లలు! అలాంటివాటిలో ఒకటి ‘ప్రతి కుక్కకూ ఓ రోజొస్తుంది..’ అనే సామెత. ఈ ఫొటోల్లోని కుక్కల హంగామా చూస్తే సామెత సింక్ అయినట్లులేదూ! రష్యాలోని ప్రఖ్యాత సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 100కుపైగా కుక్కలు వెరైటీ డ్రస్సింగ్స్‌తో అదరగొట్టాయి. ఈజిప్ట్ స్పిన్క్స్( సింహిక)లా ఒకటి, కెప్టెన్ జాక్‌స్పారోలా మరొకటి, దెయ్యం వేషంలో ఇంకొకటి అలా అలా రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసి.. సారీ.. ‘డాగ్ వాక్’చేసి చూపరులను ఆకట్టుకున్నాయి.