మాడ్రిడ్: టేకాఫ్ తీసుకోవడానికి వీల్లేనంత ఎక్కువ బరువుందని 19 మంది ప్రయాణికులను విమానం నుంచి దించేశారు..! ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని లాంజారోట్ నుంచి యూకేలోని లివర్‌పూల్‌కు ఈజీ జెట్‌కు చెందిన విమానం బుధవారం రాత్రి 9.45కు బయలుదేరాల్సి ఉంది.
విమానంలో బరువు ఎక్కువగా ఉండటానికి తోడుగా రన్‌వే పొడవు తక్కువగా ఉండటం, అననుకూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ కష్టంగా ఉందంటూ పైలట్ ప్రకటించారు. టేకాఫ్ తీసుకోవడం ప్రమాదకరమంటూ వారికి తెలిపారు. దీనికి ఏకైక పరిష్కారం బరువు కొద్దిగా తగ్గడమేనని వివరించారు.
సుమారు 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా దిగిపోతే వారికి బహుమానంగా 500 పౌండ్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత విమానంలో పంపిస్తామని సర్దిచెప్పి 19 మంది ప్రయాణికులను విమాన సిబ్బంది కిందికి దించారు. దీంతో, రెండు గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది.
చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్!
Comments
Please login to add a commentAdd a comment