జెట్‌సెట్‌గో భారీ డీల్‌...  | Jet Set Go Buys 280 Hybrid Electric Aircraft | Sakshi
Sakshi News home page

జెట్‌సెట్‌గో భారీ డీల్‌... 

Jan 20 2024 9:17 AM | Updated on Jan 20 2024 9:19 AM

Jet Set Go Buys 280 Hybrid Electric Aircraft - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ విమాన సర్వీసుల రంగంలో ఉన్న జెట్‌సెట్‌గో భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా 280 హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోంది.

హైదరాబాద్‌ బేగంపేటలో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా 2024 వేదికగా ఎలెక్ట్రా, ఏరో, హారిజన్‌ ఎయిర్‌క్రాఫ్ట్, ఓవర్‌ఎయిర్‌తో జెట్‌సెట్‌గో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. డీల్‌ విలువ సుమారు రూ.10,790 కోట్లు. హారిజన్‌ తయారీ 50 కెవోరైట్‌ ఎక్స్‌7 ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేక్‌–ఆఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (ఈవీటోల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నట్టు సమాచారం. మరో 50 ఎక్స్‌7 ఈవీటోల్స్‌ తీసుకునే అవకాశమూ ఉంది.

నగరాల్లో ఎయిర్‌ట్యాక్సీలుగా, విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు, వివిధ ప్రదేశాలకు, నగరాల మధ్య, నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లేందుకు హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించవచ్చని జెట్‌సెట్‌గో శుక్రవారం వెల్లడించింది. ‘ఈ మూడు కంపెనీలతో భాగస్వామ్యం భారత్‌కు బ్లోన్‌ లిఫ్ట్, ఫ్యాన్‌ ఇన్‌ వింగ్‌ లిఫ్ట్‌ సిస్టమ్స్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్, సూపర్‌–క్వైట్‌ ఆప్టిమల్‌ స్పీడ్‌ టిల్ట్‌ రోటర్స్‌ వంటి ప్రత్యేక సాంకేతికతలను పరిచయం చేస్తుంది’ అని జెట్‌సెట్‌గో ఫౌండర్, సీఈవో కనిక టేక్రివాల్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement