చండీగఢ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. గురువారం అర్ధరాత్రి దాటాక పంజాబ్ రాష్ట్రంలోని మోగా వద్ద విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభివన్ చౌదరి మృతిచెందినట్లు ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్‌లో ప్రకటించింది.
సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో వెస్ట్రన్ సెక్టార్‌లో లాంగియానా ఖుర్ద్ గ్రామంలో మిగ్ బైసన్ విమానం కూలిపోయినట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు భారత వైమానిక దళం అధికారులు చెప్పారు. కాగా, అభినవ్ కుటుంబానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంతాపం తెలిపింది.
మూడోది
ఈ ఏడాది మిగ్ యుద్ధ విమానాల ప్రమాదాల్లో ఇది మూడవది. జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని సూరత్ ఘడ్ వద్ద విమానం కూలిపోగా, పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. మార్చి నెలలో ఎయిర్ బేస్ వద్ద మిగ్ బైసన్ విమాన ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ గుప్తా చనిపోయారు. ట్రైనింగ్ కోసం విమానం బయలుదేరినపుడు ఈ ప్రమాదం జరగ్గా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment