Indian Air Force plane
-
ముక్కలైన మిగ్-21.. పైలెట్ దుర్మరణం
చండీగఢ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. గురువారం అర్ధరాత్రి దాటాక పంజాబ్ రాష్ట్రంలోని మోగా వద్ద విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభివన్ చౌదరి మృతిచెందినట్లు ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్లో ప్రకటించింది. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో వెస్ట్రన్ సెక్టార్లో లాంగియానా ఖుర్ద్ గ్రామంలో మిగ్ బైసన్ విమానం కూలిపోయినట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు భారత వైమానిక దళం అధికారులు చెప్పారు. కాగా, అభినవ్ కుటుంబానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంతాపం తెలిపింది. మూడోది ఈ ఏడాది మిగ్ యుద్ధ విమానాల ప్రమాదాల్లో ఇది మూడవది. జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని సూరత్ ఘడ్ వద్ద విమానం కూలిపోగా, పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. మార్చి నెలలో ఎయిర్ బేస్ వద్ద మిగ్ బైసన్ విమాన ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ గుప్తా చనిపోయారు. ట్రైనింగ్ కోసం విమానం బయలుదేరినపుడు ఈ ప్రమాదం జరగ్గా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. -
చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం
చెన్నై: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డ్ ఐజీ రాజన్ బర్గోత్రా చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదని తెలిపారు. 16 నౌకలు, 13 విమానాలు, 4 హెలికాప్టర్లతో గాలిస్తున్నట్టు బర్గోత్రా చెప్పారు. ప్రస్తుతం ఇస్రో సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. మరికొన్ని రోజులు గాలింపు జరుపుతామని ఆయన వెల్లడించారు. చివరి ప్రయత్నంగా విదేశాల సహకారం తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29 మంది ఉన్నారు. గల్లంతయిన వారిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. -
ఇంకా దొరకని విమానం ఆచూకీ
-
ఇంకా దొరకని విమానం ఆచూకీ
చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. బంగాళాఖాతంలో విమాన ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని నేవీ అధికారులు చెప్పారు. మూడున్నర కిలో మీటర్ల మేర సముద్రంలోతు ఉండటంతో గాలించడానికి కష్టమవుతోందని తెలిపారు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్‌మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. -
రేపు విశాఖ పర్యటనకు వైఎస్ జగన్
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు. అదృశ్యమైన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. -
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
-
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
-
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
విశాఖపట్నం: అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానంలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. ఫిట్టర్లు ప్రసాద్ బాబు, నాగేంద్రరావు, చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, మహారాణా, చిట్టిబాబు, ఛార్జ్మన్ సాంబమూర్తి గల్లంతయ్యారు. బాధిత కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. గంటలు గడుస్తున్నా విమానం ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం వరకు విమానం ఆచూకీ తెలియరాలేదు. ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మురం చేశారు. బంగాళాఖాతంలో భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. -
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది రంగంలోకి దిగారు. ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి. చెన్నైకు తూర్పు దిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. విమానం జాఢ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కోరింది. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. -
ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
-
ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
చెన్నె: తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం గగనతలంలో అదృశ్యమైంది. ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. విమానం అదృశ్యమై ఇప్పటికి ఆరు గంటలు దాటడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా దీనికోసం గాలింపు జరుపుతున్నాయి. బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం కావడం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయా, మరేదైనా సమస్య ఉందా అని విచారణ జరపాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.