రేపు విశాఖ పర్యటనకు వైఎస్ జగన్
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు. అదృశ్యమైన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు.