ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది రంగంలోకి దిగారు. ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి. చెన్నైకు తూర్పు దిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. విమానం జాఢ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కోరింది.
శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు.