tambaram
-
దారుణం: అందరూ చూస్తుండగానే శ్వేతను చంపేశాడు
సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదానికి గురువారం చెన్నైలో మరో యువతి బలైంది. తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమె మీద ఉన్మాది దాడి చేసి.. గొంతు భాగంలో పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాంబరం రైల్వే స్టేషన్ ఆవరణలో సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇతర ప్రయాణికులు రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించ లేదన్న ఆగ్రహంతోనే.. క్రోంపేట జీహెచ్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక కాసేపటికి ఆ యువతి మరణించింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఉన్మాదిని రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఆ యువతి ఐడీకార్డు ఆధారంగా క్రోంపేటకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఆ యువకుడి పేరు రామచంద్రన్‌గా తేలింది. క్రోంపేటలో ఉంటున్న శ్వేత.. తాంబరం రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఎంసీసీ కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా రామచంద్రన్ ప్రేమ ప్రేరిట శ్వేతను వేధిస్తున్నట్లు సహచర విద్యార్థినులు పోలీసుల దృష్టికి తెచ్చారు. చదవండి: (అత్యాచారం చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడు) అలాగే, రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇక, ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన రామచంద్రన్‌ను విచారించగా, తామిద్దరం ప్రేమికులుగా పేర్కొనడం గమనార్హం. నాగపట్నంకు చెందిన రామచంద్రన్ చెన్నై శివారులోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2019లో నాగపట్నం నుంచి వస్తుండగా శ్వేతతో తనకు రైలులో పరిచయం ఏర్పడినట్లు వెల్లడించాడు. హఠాత్తుగా తనను దూరం పెట్టడంతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు రామచంద్రన్ వాంగ్ములం ఇచ్చాడు. కాగా, గతంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి అనే టెక్కిని ఇదే రకంగా ఓ ప్రేమోన్మాది నరికి చంపిన విషయం తెలిసిందే. చదవండి: (వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్) -
చెన్నైలో ఆటో రేసింగ్.. ఒళ్లు గగుర్పొడవడం ఖాయం
చెన్నై: చెన్నైలోని తాంబరంలో ఆన్లైన్ నిర్వహకులు చేపట్టిన ఆటో రేసింగ్ ఆలస్యంగా వెలుగుచూసింది.ఆదివారం తాంబరం- పోరూర్ ప్రాంతంలో జరిగిన రేసింగ్ మొత్తం ప్రాణంతకంగా కనిపించింది. రోడ్డుపై వాహనాల బిజీగా వెళ్తున్న సమయంలోనే రేసింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. కాగా వీడియోలో ముందు బైక్‌లపై కొందరు యువకులు ఆటోవాలాలకు సూచనలు ఇస్తుండగా.. ఆటోడ్రైవర్లు తమ రేసింగ్‌ను కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అయితే ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రేసింగ్ నిర్వాహకులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా ఆన్లైన్ కేంద్రంగా కొన్ని ముఠాలు ఇలాంటి రేస్‌లకు పాల్పడుతున్నాయి. గెలిచిన వ్యక్తికి రూ. 10 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తారు. డబ్బుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో 2019లో బిజీగా ఉన్న రోడ్లపై బైక్ రేసింగ్‌లో బస్‌ను గుద్దడంతో ఒక వ్యక్తి తన ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. -
వీళ్లసలు మనుషులేనా?
-
వీళ్లసలు మనుషులేనా?
సాక్షి, చెన్నై : తాంబరంలోని ఒక ప్రయివేట్ కాలేజ్‌లో చదుతున్న ఇద్దరు విద్యార్థులు ఒక వీధికుక్కను అత్యంత కౄరంగా, దారుణంగా హింసించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు విద్యార్థులు కుక్కకు ఊపిరి ఆడకుండా గొంతుకు, నడుముకు తాడు కట్టి.. అటూఇటూ ఇద్దరు రోడ్డు మీదమీద ఈడ్చుకు వెళుతుంటే ప్రాణం కోసం మూగ జంతువు గిలగిలా కొట్టుకుంటోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి స్పందించిన బ్లూక్రాస్ వాళ్లు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ.. చెన్నై పోలీస్ కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు.. అనుమానిత వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. -
భగవంతుడా మాకేంటీ కష్టం..!
పరామర్శించడానికి ఎవరు ఇంటికొచ్చినా ఏదైనా శుభవార్త చెబుతారేమోనని ఆ కుటుంబాలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఏ క్షణాన్నైనా తమ డాడీ తలుపు తడతారేమోనని ఆ చిన్నారుల కళ్లు ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడూ ధైర్యం చెప్పే కుమారుడి కోసం ఆ వృద్ధ తల్లిదండ్రుల హృదయం తపిస్తోంది. వారమైనా.. ఎటువంటి జాడ దొరకని ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాల దయనీయ పరిస్థితి ఇది. గోపాలపట్నం : గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ విమానం ఉన్న ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ దుర్వార్త విని వారం రోజులైపోయింది. ఇంతకీ విమానం ఏమైంది.. ఎక్కడైనా క్షేమంగా ఉందా.. ఉంటే అందులో వారు ఎక్కడున్నారు.. ఎలా ఉన్నారు..? ఇవీ బాధిత కుటుంబాలను దహించేస్తున్న ప్రశ్నలు. భగవంతుడా మాకేంటీ కష్టం.. అంటూ ఆ కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్.వి.ప్రసాద్‌బాబు, పూర్ణచంద్రసేనాపతి, చరణ్మహరాణా, ఎన్.చిన్నారావు, జి.శ్రీనివాసరావులతో పాటు 29 మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు గత శుక్రవారం ఉదయం ఎయిర్‌ఫోర్స్ విమానంతో గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి నేటి వరకూ ఆయా కుటుంబాలు అంతులేని ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ఏ క్షణాన తలుపుకొడతారేమోని ఆశగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకూ నేవీ ఉన్నతాధికారుల పరామర్శలు చేస్తే.. ఇప్పుడు ఎన్ఏడీ ఉన్నతాధికారులు రోజూ ఆయా కుటుంబాలను కలిసి ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. షిప్పులు, సబ్మెరైన్లు, కోస్టుగార్డులు, ఎయిర్‌ఫోర్సు, నేవీ, హెలికాఫ్టర్లు.. శాటిలైట్, రాడార్లతో సంద్రంలో, తీరమంతటా...ఇలా అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నా స్పష్టమైన సమాచారం రాలేదని చెబుతున్నారు. ధైర్యంగా ఎలా ఉండగలం బాబూ.. ఎన్ఏడీ ఉన్నతాధికారులు, యూనియన్ నేతలు బుధవారం ఆయా కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వేపగుంట బీసీ కాలనీలో గంట్ల శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించినపుడు ఆయన తల్లి రోదించింది. నాఒక్కగానొక్క కొడుకు గల్లంతయి వారమవుతుంది. ఎక్కడ గల్లంతయ్యాడో.. ఎక్కడున్నాడో తెలియడం లేదు.. ఇలాంటి పరిస్థితిలో మేమెలా ధైర్యంగా ఉండగలం బాబూ.. అంటూ ఆందోళన వెలిబుచ్చింది. శ్రీనివాసరావు భార్య ఈశ్వరి మాత్రం ఇంటి నుంచి ప్రయాణానికి బయల్దేరినపుడు భర్తకు ఎదురొచ్చిన పరిస్థితినే కళ్లలో పెట్టుకుని ఎదురు చూస్తోంది. ఈశ్వరి.. అమ్మా.. బైబై.. మరో పది రోజుల్లో వచ్చేస్తా.. ధైర్యంగా ఉండండన్న శ్రీనివాసరావు మాటలనే గుర్తు చేసుకుంటున్నారు. లోపల ఆందోళన ఎంతున్నా భర్త తిరిగొస్తాడనే మాటే ఆమె నుంచి వ్యక్తమవుతోంది. ఆమె రెండేళ్ల బిడ్డ డాడీ.. ఇదిగో.. అంటూ ఆల్బమ్ ఫొటోలను చూపుతుంటే అందరికీ కళ్లు చెమరుస్తున్నాయి. గోపాలపట్నం శ్రీనివాసనగర్‌లో ఉన్న పాటి నాగేంద్ర భార్యదీ అదే పరిస్థితి. ఆమె పిల్లలు అమ్మా.. నాన్న ఎక్కడ.. ఎపుడొస్తారంటూ ప్రశ్నిస్తుంటే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. భగవంతుని దయతో గల్లంతైన వారు ప్రాణాలతో రావాలని జనమంతా ప్రార్థనలు చేస్తున్నారు. అప్పట్లో తండ్రి.. ఇప్పుడు కుమారుడు వేపగుంట బీసీ కాలనీకి చెందిన గంట్ల నూకరాజు(42) ఎన్ఏడీలో డ్రైవరుగా పనిచేసేవారు. ఆయనకు భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు. 2001 డిసెంబరు 26న నూకరాజు విధి నిర్వహణలో ఉండగా.. 24 గంటల కడుపునొప్పి వచ్చి హఠాన్మరణం చెందారు. ఆయన ఉద్యోగం శ్రీనివాసరావుకు వచ్చింది. దీంతో శ్రీనివాసరావు ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. రక్షణ రంగానికి సంబంధించి మంచి నైపుణ్యం సంపాదించాడు. ఆ రకంగా ఈ నెల 20న ఇంటి నుంచి పోర్టుబ్లెయర్కు సహచర ఏడుగురు ఉద్యోగులతో బయలుదేరిన ఆయన గల్లంతైన సమాచారం ఇంటిల్లిపాదినీ కుదిపేస్తోంది. -
చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం
చెన్నై: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డ్ ఐజీ రాజన్ బర్గోత్రా చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదని తెలిపారు. 16 నౌకలు, 13 విమానాలు, 4 హెలికాప్టర్లతో గాలిస్తున్నట్టు బర్గోత్రా చెప్పారు. ప్రస్తుతం ఇస్రో సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. మరికొన్ని రోజులు గాలింపు జరుపుతామని ఆయన వెల్లడించారు. చివరి ప్రయత్నంగా విదేశాల సహకారం తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29 మంది ఉన్నారు. గల్లంతయిన వారిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. -
ఇంకా దొరకని విమానం ఆచూకీ
-
ఇంకా దొరకని విమానం ఆచూకీ
చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. బంగాళాఖాతంలో విమాన ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని నేవీ అధికారులు చెప్పారు. మూడున్నర కిలో మీటర్ల మేర సముద్రంలోతు ఉండటంతో గాలించడానికి కష్టమవుతోందని తెలిపారు. మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్‌మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. -
ఆ శకలం గల్లంతైన విమానానిదేనా?
సాక్షి, చెన్నై : బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం కోసం అన్వేషణ తీవ్రతరమైంది. అయితే చెన్నైకి 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఓ వస్తువు లభించినట్లు సమాచారం. అది విమాన శకలమా లేక మరొకటా అనేది తెలియాల్సిఉంది. వస్తువు లభించిన ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్వయంగా సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఏఎన్-32 ఎయిర్‌ఫోర్స్ విమానం ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్టుగార్డు, వైమానిక దళం వర్గాలు జలాంతర్గామి, ఎనిమిది విమానాలు, 18 నౌకలతో ఆచూకీ కోసం అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మంది జాడ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ మంత్రి పర్యవేక్షణ: ఏఎన్ -32 గల్లంతు సమాచారంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం ఉదయమే తమిళనాడుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అరక్కోణం వైమానిక దళానికి, అక్కడ అదృశ్యమైన విమానానికి సంబంధించి సిద్ధం చేసిన ఫొటోలను పరిశీలించారు. గాలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాలింపులో సాంకేతిక పరిజ్ఞానం, ఆ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బంగాళాఖాతంలో ఏఎన్-32 విమానంతో సంబంధాలు తెగినట్టుగా భావిస్తున్న ప్రదేశం వరకు పర్యటించారు. గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. తదుపరి తాంబరం ఎయిర్‌బేస్‌కు చేరుకుని వైమానిక, నౌకాదళం వర్గాలతో చర్చించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి పర్యవేక్షణలో ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ కమిటీ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో వైమానిక, నౌకాదళం వర్గాలతో పాటు, సాంకేతిక నిపుణుల్ని నియమించినట్టు తెలిసింది. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో చెన్నైకు చెందిన ముత్తుకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నట్టు సమాచారం. -
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
-
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
-
ఆ విమానంలో 9మంది విశాఖవాసులు
విశాఖపట్నం: అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానంలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. ఫిట్టర్లు ప్రసాద్ బాబు, నాగేంద్రరావు, చిన్నారావు, శ్రీనివాసరావు, సేనాపతి, మహారాణా, చిట్టిబాబు, ఛార్జ్మన్ సాంబమూర్తి గల్లంతయ్యారు. బాధిత కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. గంటలు గడుస్తున్నా విమానం ఆచూకీ తెలియకపోవడంతో గల్లంతయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో మొత్తం 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం వరకు విమానం ఆచూకీ తెలియరాలేదు. ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మురం చేశారు. బంగాళాఖాతంలో భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. -
ఏఎన్-32 కోసంగా విస్తృతంగా గాలింపు
అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది రంగంలోకి దిగారు. ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి. చెన్నైకు తూర్పు దిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. విమానం జాఢ తెలుసుకునేందుకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కోరింది. శుక్రవారం ఉదయం తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. -
ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
చెన్నె: తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం గగనతలంలో అదృశ్యమైంది. ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. విమానం అదృశ్యమై ఇప్పటికి ఆరు గంటలు దాటడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా దీనికోసం గాలింపు జరుపుతున్నాయి. బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం కావడం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయా, మరేదైనా సమస్య ఉందా అని విచారణ జరపాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
తాంబరంలో కొత్త బస్‌స్టేషన్ ప్రారంభం
టీనగర్, న్యూస్‌లైన్: చెన్నై, తాంబరంలో కొత్తగా ఏర్పాటైన బస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జయలలిత బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ బస్టేషన్ రూ.4 కోట్ల 95 లక్షలతో నిర్మింతమైంది. అదే విధంగా కోయంబత్తూరు తమిళనాడు నగర శిక్షణ కేంద్రంలో రూ.75 లక్షలతో అదనపు వసతి గృహాలు, నాగపట్టణం జిల్లా నాగపట్టణం మునిసిపాలిటీలో రూ.కోటి 15 లక్షలతో ఏర్పాటైన కొత్త కార్యాలయ భవనం, తేని మావట్టం చిన్నమనూరు మునిసిపాలిటీలో రూ.కోటితో ఏర్పాటైన వారపు సంత భవనాన్ని చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. భూగర్భ డ్రైనేజీ పథకం ప్రారంభం పెరంబలూరు మునిసిపాలిటీలో 31 కోట్ల 91 లక్షలు, రామనాథపురం మునిసిపాలిటీలో రూ.31 కోట్ల 51 లక్షలు, తేని జిల్లా చిన్నమలూరు మునిసిపాలిటీలో రూ.14 కోట్ల 52 లక్షలు, దిండుగల్ మునిసిపాలిటీలో రూ.46 కోట్ల 15 లక్షలు, ధర్మపురి మునిసిపాలిటీలలో 24 కోట్ల ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ పథకాలను ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు.