
చెన్నై: చెన్నైలోని తాంబరంలో ఆన్‌లైన్ నిర్వహకులు చేపట్టిన ఆటో రేసింగ్ ఆలస్యంగా వెలుగుచూసింది.ఆదివారం తాంబరం- పోరూర్ ప్రాంతంలో జరిగిన రేసింగ్ మొత్తం ప్రాణంతకంగా కనిపించింది. రోడ్డుపై వాహనాల బిజీగా వెళ్తున్న సమయంలోనే రేసింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. కాగా వీడియోలో ముందు బైక్‌లపై కొందరు యువకులు ఆటోవాలాలకు సూచనలు ఇస్తుండగా.. ఆటోడ్రైవర్లు తమ రేసింగ్‌ను కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.
అయితే ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు రేసింగ్ నిర్వాహకులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా ఆన్‌లైన్ కేంద్రంగా కొన్ని ముఠాలు ఇలాంటి రేస్‌లకు పాల్పడుతున్నాయి. గెలిచిన వ్యక్తికి రూ. 10 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తారు. డబ్బుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో 2019లో బిజీగా ఉన్న రోడ్లపై బైక్ రేసింగ్‌లో బస్‌ను గుద్దడంతో ఒక వ్యక్తి తన ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment