అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో విస్తృతంగా గాలిస్తున్నారు. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది రంగంలోకి దిగారు. ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి.