ఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్ను మంగళవారం న్యూఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కలిశారు. ఏఎన్-32 విమాన ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యుల ఆందోళనను కేంద్ర మంత్రి పరికర్కు వైఎస్ఆర్సీపీ ఎంపీలు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏఎన్-32 విమానంపై నిబంధనల ప్రకారం 30 రోజుల తర్వాత.. అధికారిక ప్రకటన చేస్తామని పరికర్ చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విమానం ఆచూకీ తెలిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరికర్ అన్నారని చెప్పారు. విమానంలోని పౌరులకు కూడా అధికారులలాగే పరిహారం ఇస్తామన్నారని వారు పేర్కొన్నారు.
కాగా, గత నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించిన సంగతి విధితమే.
మంత్రి పరికర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు
Published Tue, Aug 9 2016 4:02 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM