
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపు.. యద్ధ విమానాల తయారీలోనూ తన సత్తా చాటనుంది. ఖరీదైన రక్షణ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా... స్థానికంగానే వాటి ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ "ఆత్మనిర్భర్ భారత్" కార్యక్రమంలో టాటా గ్రూపు పాలుపంచుకోనుంది. అత్యంత ఎత్తులో విహరించగల ట్విన్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలో తన సామర్ధ్యాలను టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్ లిమిటెడ్. బుధవారం నుంచి(ఈ నెల 3 నుంచి 5 వరకు) బెంగళూరులో జరిగే 'ఏరో ఇండియా 2021" కార్యక్రమంలో ప్రదర్శించనుంది. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.
రెండేళ్ళకొకసారి బెంగళూరులో ఏరో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాల తయారీకి సంబంధించి మేధోపరమైన హక్కులను టాటా అడ్వాన్స్‌డ్ సి ఇప్పటికే సొంతం చేసుకుంది. టాటా సంస్థ రూపొందించిన మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విజయం సాధిస్తే... ప్రైవేటు రంగంలో యుద్ధ విమానాలను తయారు చేయగల తొలి దేశీయ సంస్థగా అవతరించనుంది. ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లీమిటెడ్ ఒక్కటే ఇప్పటి వరకు ఈ సామర్థ్యాలను నిరూపించుకున్న సంస్థ కావడం గమనార్హం. అంతేకాదు, భారత్‌లో తయారీ కార్యక్రమానికి మరింత మద్దతు కూడా లభించనుంది. టాటా నూతన యుద్ద విమానాన్ని సరిహద్దుల్లో నిఘా, సైనిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుందని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment