
ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నప్పుడు అదే కారులో ఆకాశంలోకి ఎగురుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోతే ఎంత బాగుంటుంది.. ఇప్పటివరకూ ఇది కలే.. మరికొన్ని రోజుల్లో నిజమవనుంది. ఎందుకంటే.. టెర్రాఫ్యూజియా అనే కంపెనీ తయారుచేసిన ‘ట్రాన్సిషన్’ అనే ఈ ఎగిరే కారుకు సంబంధించిన తొలిదశ విక్రయాలు అక్టోబర్‌లో మొదలవనున్నాయి.
ఈ కారు ఒక నిమిషం వ్యవధిలో ఇలా రెక్కలు విప్పుకుని విమానంలా మారిపోతుంది. రెండు సీట్ల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు బరువు 590 కిలోలు. అత్యధిక వేగం గంటకు 160 కిలోమీటర్లు, 10 వేల అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. అయితే దీన్ని నడపడానికి మనకు డ్రైవింగ్ లైసెన్సుతోపాటు పైలెట్ లైసెన్సు కూడా ఉండాలి. ఈ టెర్రాఫ్యూజియా ‘వోల్వో’కు చెందిన స్టార్టప్ కంపెనీ అట.. కార్ల డెలివరీ వచ్చే ఏడాదిలో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ధర రూ. 3 కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment