న్యూఢిల్లీ: విచ్చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు భారత్‌ను వీడారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కి వచ్చిన ఆయన.. మంగళవారం కెనడాకు బయల్దేరి వెళ్లారు. వాస్తవాడానికి ట్రూడో సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత సెప్టెంబర్ 10న (ఆదివారం) సాయంత్రం తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ ముందస్తు తనిఖీ సమయంలో ఆయన అధికారిక విమానంలో(ఎయిర్‌బస్ CFC001) సాంకేతిక సమస్య తలెత్తడంతో రెండు రోజులుగా భారత్‌లోనే చిక్కుకుపోయారు. దీంతో 36 గంటలపాటు ట్రూడో, ఆయన బృందం ఢిల్లీలోనే స్టే చేయాల్సి వచ్చింది.
రెండు రోజుల అనిశ్చితి అనంతరం కెనడా ప్రధాని చివరకు నేడు(మంగళవారం) మధ్యాహ్నం 1.10 గంటలకు స్వదేశానికి బయలుదేరారు. ఆయన విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దినట్లు, ఇప్పుడు ఇది ఎగరడానికి సిద్ధంగా ఉందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడ్కోలు పలికారు. ట్రూడో క్షేమంగా కెనాడాకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి కెనడా ఎయిర్‌ఫోర్స్ మరో విమానం భారత్‌కు తరలిస్తున్న సమయంలో ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం.
ఇక కెనడా అధికారిక విమానాలు ఆ దేశ ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2016లో యూరోపియన్ యూనియన్‌తో చర్చల కోసం బెల్జియం బయల్దేరిన కెనడా ప్రధాని విమానంలో సాకేంతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ అయిన అరగంటలోనే తిరిగి కెనడాకే రావాల్సి వచ్చింది. ఇక 2019 అక్టోబర్‌లోనూ ట్రూడో వీఐపీ విమానం ఓ గోడను పొరబాటున ఢీకొంది. అప్పట్లో దీని ముక్కుభాగం, కుడిభాగం ఇంజిన్ దెబ్బతింది. దీంతో ఆ విమానాన్ని పలు నెలలపాటు వాడకుండా పక్కకు పడేశారు.
చదవండి: Monu Manesar: గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్
అదే ఏడాది డిసెంబర్‌లో ట్రూడో నాటో సమ్మిట్‌కు హాజరు కావడానికి బ్యాకప్ విమానాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అయితే రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో లోపం ఉన్నట్లు గుర్తించినందున ఆ జెట్ కూడా లండన్‌లో నిలిచిపోయింది.
వరుస షాక్‌లు
ఇదిలా ఉండగా.. ట్రూడో భారత్ పర్యటన మొత్తం గందరగోళంగానే గడించింది. ఇందుకు ఆయన అందరితోనూ అంటీ ముట్టన్నట్లుగా వ్యవహరించడమే కారణం. అమెరికా, బ్రిటన్, భారత్, యూఏఈ దేశాల అధినేతలతో జస్టిన్ ట్రూడో కలవలేదు. ప్రధాన వేదికపై కూడా ఆయన కనిపించలేదు. చివరికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన విందులోనూ కూడా ఆయన కనిపించలేదు.
ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు. ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలతో సరిగా కలవలేదని, ట్రూడోను ఎవరూ పట్టించుకోలేదని.. ఆయన్ను పక్కకు పెట్టారని అక్కడి పత్రికలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
చదవండి: LIbiya: లిబియాలో పెను విపత్తు.. 2000 మందికిపైగా మృతి
కాగా జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ ట్రూడో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని ఏకంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు.. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment