మారుత్‌ డ్రోన్స్, స్కైడ్రైవ్‌ ఎంవోయూ | Marut Drones And SkyDrive Forge Future Air Travel Partnership In India, Details Inside - Sakshi
Sakshi News home page

మారుత్‌ డ్రోన్స్, స్కైడ్రైవ్‌ ఎంవోయూ

Published Fri, Jan 19 2024 1:57 AM | Last Updated on Fri, Jan 19 2024 9:46 AM

Marut Drones and SkyDrive Forge Future Air Travel  - Sakshi

హైదరాబాద్‌: మారుత్‌ డ్రోన్స్, స్కైడ్రైవ్‌ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వ్యాపారాభివృద్ధితోపాటు, ఎలక్ట్రిక్‌ వెరి్టక్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (ఈవీటాల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎయిర్‌ ట్యాక్సీ/ఫ్లయింగ్‌ ట్యాక్సీ) విభాగంలో అవకాశాల అన్వేషణకు ఇది వీలు కల్పించనుంది.

తప్పనిసరి మినహాయింపులు, సరి్టఫికెట్‌లను సొంతం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ మద్దతు పొందడం, పైలట్, మెకానిక్‌లకు శిక్షణ, కీలక భాగస్వాముల గుర్తింపు విషయంలో మారుత్‌ డ్రోన్స్‌కు ఈ సహకారం తోడ్పడనుంది. మారుత్‌ డ్రోన్స్‌ ఇప్పటికే డ్రోన్ల కోసం అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఎంఎవోయూతో ఎయిర్‌ట్యాక్సీ కార్యకలాపాల్లోకీ విస్తరించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement