Air taxi
-
భారత్‌లో మొదటి ఎయిర్ ట్యాక్సీ 'శూన్య': దీని గురించి తెలుసా?
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సరళా ఏవియేషన్' భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో2025లో తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ 'శూన్య'ను ఆవిష్కరించింది. కంపెనీ దీనిని 2028 నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.శూన్యా ఎయిర్ ట్యాక్సీ.. 20 కిమీ నుంచి 30 కిమీ దూరాల ప్రయాణాలు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 680 కేజీలు బరువు మోయగల ఈ ఎయిర్ టాక్సీలో ఆరుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో అత్యధిక పేలోడ్ మోయగల కెపాసిటీ ఉన్న ఎయిర్ టాక్సీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ధరలను అధికారికంగా వెల్లడించలేదు.శూన్య ఎయిర్ ట్యాక్సీ.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చడానికి మాత్రమే కాకుండా.. కాలుష్యం వంటి సవాళ్లను పరిష్కరించడానికి కూడా సహరిస్తుందని సరళ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 'అడ్రియన్ ష్మిత్' పేర్కొన్నారు.సరళ ఏవియేషన్‌ను.. అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు అక్టోబర్ 2023లో స్థాపించారు. ఈ స్టార్టప్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ భాగస్వామ్యంతో Accel నేతృత్వంలోని సిరీస్ A ఫండింగ్‌లో 10 మిలియన్లను సేకరించింది. కాబట్టి ఈ కంపెనీ త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.సరళ ఏవియేషన్‌ను కంపెనీ తన ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను.. బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణె సహా ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణీకుల రవాణాతో పాటు, పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించాలని సరళ ఏవియేషన్ యోచిస్తున్నట్లు సమాచారం.ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధికి కేంద్రంనగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టంభారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి, రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి.. ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.ప్రయాణ ఖర్చు తక్కువే..ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు 'ఆర్చర్ ఏవియేషన్'తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. -
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరియల్ ట్యాక్సీలు నడిచేందుకు వీలుగా ‘వెర్టిపోర్ట్’(ఎయిర్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ప్రదేశం)లను ఏర్పాటు చేసేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంగీకారం తెలిపారు. దాంతో దుబాయ్ మొదటిసారి అర్బన్ ఏరియల్ ట్రాన్స్పోర్ట్ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే వెర్టిపోర్ట్‌లో టేకాఫ్, ల్యాండింగ్ జోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, టాక్సీ పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేయనున్నారు. ఏటా సుమారు 1,70,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎయిర్ కండిషన్డ్ వెర్టిపోర్ట్లను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీల సహకారం తీసుకోనున్నారు. జాబీ ఏవియేషన్, సైపోర్ట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు తమ సేవలందించనున్నాయి. జాబీ ఏవియేషన్ విమానాల తయారీ, కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. స్కైపోర్ట్ మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రస్తుత రవాణా వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఈ ఎయిర్‌ట్యాక్సీ సర్వీసులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుజాబీ ఏవియేషన్ తయారు చేసిన ఏరియల్ టాక్సీ ఎస్4 మోడల్ సున్నా ఉద్గారాలతో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. అది నిలువుగా టేకాఫ్, ల్యాండ్ అవ్వగలదు. దీని గరిష్ట వేగం 321 కిమీ/గం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎస్4 ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. సంప్రదాయ హెలికాప్టర్ల కంటే చాలా తక్కువ శబ్దం చేస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్టీఏ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ), దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డీసీఏఏ), స్కైపోర్ట్, జాబీ ఏవియేషన్‌లు ఏరియల్ టాక్సీ సేవలకు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ఆవిరి శక్తితో..ఆకాశ యాత్ర
పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్: జేమ్స్‌వాట్ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం చరిత్ర గతిని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది. అదే ఆవిరి శక్తిని ఇంధనంగా వినియోగించుకుంటూ ఎయిర్ ట్యాక్సీలు సిద్ధమవుతున్నాయి. ఉబర్.. ఓలా.. రాపిడో తరహాలో ఎయిర్ ట్యాక్సీలు ఆకాశయానంతో సందడి చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఏవియేషన్ సంస్థలు నమ్మకంగా చెబుతున్నాయి. తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో తయారైన ఎయిర్ ట్యాక్సీ కాలిఫోరి్నయా మీదుగా రికార్డు స్థాయిలో 561 మైళ్లు (902 కి.మీ.) విజయవంతంగా ప్రయాణించింది.ఆరిజోనాలోని ఎర్రరాతి శిలలతో కూడుకున్న విశాలమైన లోయ ప్రాంతం గ్రాండ్ కాన్యాన్‌తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ. జోబి ఏవియేషన్ కంపెనీలో పురుడు పోసుకున్న ఈ ఫ్లైయింగ్ కార్ పూర్తిగా హైడ్రోజన్‌తో నడుస్తుంది. నీటి ఆవిరి మినహా ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయకపోవడం దీని ప్రత్యేకత. ‘‘శాన్ ఫ్రాన్సిస్కో నుంచి శాండియాగో, బోస్టన్, బాలి్టమోర్ లేదా నాష్విల్లే నుంచి న్యూఓర్లాన్స్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేయటాన్ని ఊహించుకోండి.నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లని ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించే రోజు చాలా దగ్గర్లోనే ఉంది’’అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జో బెన్ బెవిర్ట్ వెల్లడించారు. అమెరికా సైనిక విభాగం ఈ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగానికి పాక్షికంగా నిధులు సమకూర్చడం విశేషం. ఎంత మంది? జోబి ఏవియేషన్ తయారు చేసిన ఎయిర్ ట్యాక్సీకి ఆరు ప్రొఫెల్లర్లు ఉంటాయి. హెలికాఫ్టర్ తరహాలో గాల్లోకి ఎగిరేందుకు, కిందకు దిగేందుకు ఇవి తోడ్పడతాయి. టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన తరువాత ప్రొఫెల్లర్లు నిట్ట నిలువు నుంచి బల్లపరుపుగా మారతాయి. రెక్కలున్న సంప్రదాయ ఎయిర్ క్రాఫ్ట్ తరహాలో ఎయిర్ ట్యాక్సీ ఆకాశంలో ఎగిరేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు.ఏమిటి దీని ప్రత్యేకత? ఎయిర్ ట్యాక్సీ అనేది కొత్త ఆవిష్కరణ కాకపోయినా జోబీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రొఫెల్లర్లకు సమకూర్చిన ఇంధనం మాత్రం కొత్త ప్రయోగమే. 40,000 కి.మీ. తిరిగిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి దీన్ని తయారు చేశారు. పాత ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాటరీల స్థానంలో 40 కిలోల ద్రవ హైడ్రోజన్ సామర్థ్యం కలిగిన ఇంధన సెల్స్‌ను అమర్చారు. ట్యాక్సీకి అవసరమైన విద్యుత్తు, ఉష్ణోగ్రత, నీటి ఆవిరిని ఇవి అందిస్తాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో అదనపు శక్తి అందించేందుకు కొన్ని బ్యాటరీలు ఉంటాయి.బ్యాటరీ ట్యాక్సీల కంటే మెరుగైన సామర్థ్యం గతంలో రూపొందించిన బ్యాటరీలతో పనిచేసే ఎయిర్ ట్యాక్సీలు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 – 150 మైళ్లు (160 – 240 కి.మీ.) ప్రయాణించాయి. హైడ్రోజన్‌తో నడిచే ఎయిర్ ట్యాక్సీలో మాత్రం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లవచ్చని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా 561 మైళ్లు నడిపి చూశారు. లండన్ నుంచి ప్యారిస్, జ్యూరిచ్, ఎడిన్బర్గ్ ఆగాల్సిన అవసరం లేకుండా వెళ్లవచ్చు. ఎయిర్ ట్యాక్సీల నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా వివిధ నగరాలకు వెళ్లవచ్చని చెబుతున్నారు. హైడ్రోజన్ మోడల్ ఎయిర్ ట్యాక్సీలు కచి్చతంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఆయన వెల్లడించలేదు.పోటాపోటీ..ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ వినియోగంలో వచి్చన ఆధునిక మార్పులు ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి. ఎలక్ట్రిక్ క్యాబ్‌లపై విస్తృత పరిశోధనలు నిర్వహించిన ఏవియేషన్ స్టార్టప్‌లు జీ ఏరో, కిట్టీ హాక్‌లపై గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్ లక్షల డాలర్ల నిధులను వెచి్చంచారు. ఎయిర్ స్పేస్ ఎక్స్ లాంటి పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.తమ ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలి్పస్తామంటూ ఊరిస్తోంది. వైద్య అవసరాల కోసం అత్యవసరంగా తరలించేందుకు కూడా సేవలందిస్తామంటోంది. ఇక క్యాబ్ సేవల సంస్థ ఉబర్ కూడా దీనిపై దృష్టి సారించింది. 2018 జనవరిలో నిర్వహించిన ఓ సాంకేతిక సదస్సులో ఉబర్ సీఈవో డారా ఖొస్రోవ్‌షాహి ఈమేరకు ఓ ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో ఇవి సాకారం కానున్నట్లు అప్పట్లోనే చెప్పారు. దుబాయ్‌లో బీచ్ విహారం.. తమ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ నుంచి 3 – 5 దశల ధ్రువీకరణ పూర్తి చేసుకున్నట్లు జోబీ చెప్పారు. దుబాయ్ నుంచి వీటి సేవలు ప్రారంభం కానున్నట్లు గతంలోనే జోబీ ఏవియేషన్ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు దుబాయ్ రోడ్డు రవాణా సంస్థతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వీటి ద్వారా దుబాయ్ విమానాశ్రయం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం, కృత్రిమ దీవుల సముదాయం పామ్ జుమేరా బీచ్‌కు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు.బ్యాటరీతో నడిచే ఎయిర్ ట్యాక్సీ పరీక్షలు విజయవంతం కావడంతో హైడ్రోజన్ మోడల్ కూడా సత్ఫలితాలనిస్తుందని కంపెనీ గట్టి నమ్మకంతో ఉంది. అయితే ఈ రెండు మోడళ్ల ధరలు ఎంత ఉంటాయనే విషయాన్ని ఇంతవరకు వెల్లడించలేదు. వాణిజ్యపరంగానూ వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎయిర్ ట్యాక్సీల వాడకం 2028 నాటికి సాధారణంగా మారుతుందని, పైలెట్ల అవసరం లేకుండా ఎగిరే ట్యాక్సీలు 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని బ్రిటన్ భావిస్తోంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్
-
దేశంలోకి ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్..ఛార్జీలు ఎంతో తెలుసా..?
-
గాల్లో తేలుతూ గమ్యస్థానానికి.. ఇక ట్రాఫిక్ గురించి భయమేల?
నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే.. విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రయత్నాలను ప్రారంభించింది. భారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి భారతదేశపు ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.ఇండిగో పేరెంట్ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు ఆర్చర్ ఏవియేషన్‌తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.2026 నాటికి భారతదేశంలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయని ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయెల్ వెల్లడించారు. దీని కోసమే ఆర్చర్‌కు చెందిన ఒక బృందం ఇటీవల భారతదేశంలోని విమానయాన అధికారులను కలిసింది.భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికులు వేగంగా గమ్యం చేరుకోవచ్చు.ఎయిర్ టాక్సీ ధరలు..ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి ఉబర్ ఛార్జ్ రూ. 1500 నుంచి రూ. 2000. అయితే ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి సుమారు రూ. 2000 నుంచి రూ. 3000 వెచ్చించాల్సి ఉంటుందని ఐజీఈ చీఫ్ రాహుల్ భాటియా పేర్కొన్నారు. ఖచ్చితమైన ధరలు ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత వెల్లడవుతాయి.ప్రయాణ సమయం తగ్గుతుంది..ఒకసారి భారతదేశంలో ఎయిర్ టాక్సీ సర్వీస్ ప్రారంభమైతే.. ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని కన్నాట్ నుంచి గురుగ్రామ్ చేరుకోవడానికి 27 కిలోమీటర్లు 90 నిముషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఈ దూరాన్ని ఎయిర్ టాక్సీ ద్వారా 7 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలుస్తోంది.ఒకసారికి నలుగురు మాత్రమే..ఎయిర్ టాక్సీలు పూర్తిగా ఎలక్ట్రిక్.. వీటిని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 30 నుంచి 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చూడటానికి ఇవి హెలికాప్టర్ల మాదిరిగా ఉన్నప్పటికీ చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. ఎయిర్ టాక్సీలో ఒకసారికి నలుగురు మాత్రమే ప్రయాణించవచ్చు.ఇదీ చదవండి: పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు ఎయిర్ టాక్సీల వల్ల ఉపయోగాలుట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఎయిర్ టాక్సీ అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యవసర సమయాల్లో వైద్యశాలకు వెళ్లాలన్నా.. సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలన్నా.. ఎయిర్ టాక్సీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ రోజు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు దగ్గర వద్దకు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్ కారణంగా చాలా మంది ప్రముఖులు మెట్రోలో ప్రయాణించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఎయిర్ టాక్సీ నేడు చాలా అవసరం. -
త్వరలోనే ఎగిరే ట్యాక్సీ.. అదీ మన హైదరాబాద్‌లోనే..!
-
తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! ‘సాక్షి’తో సీఈఓ ప్రేమ్ కుమార్
‘‘రెండేరెండు గంటల్లో హైదరాబాద్ నుంచి అటవీ ప్రాంతమైన ములుగుకు ఎయిర్ ట్యాక్సీలో గుండెను తీసుకెళ్లి రోగి ప్రాణాలు కాపాడొచ్చు’’. ‘‘తొమ్మిది గంటల్లో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి ఎంచక్కా ఎగురుతూ వెళ్లిపోవచ్చు’’. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే 2025లోనే ఇవన్నీ నిజమవుతాయి. జపాన్‌కు చెందిన ఫ్లయింగ్ కార్ల తయారీ సంస్థ స్కై డ్రైవ్ పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. మనదేశంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ తయారీ సంస్థ మారుత్ డ్రోన్స్‌తో ఒప్పందం చేసుకుంది. సాక్షి, హైదరాబాద్: భూమి ఉపరితలం నుంచి 5 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ప్రయాణించడం ఎయిర్ ట్యాక్సీల ప్రత్యేకత. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడంతోపాటు కొండ ప్రాంతాలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు ప్రయాణికులను తీసుకెళ్లడమే లక్ష్యమని మారుత్‌డ్రోన్ సీఈఓ ప్రేమ్‌కుమార్ విస్లావత్ ‘సాక్షి’కి తెలిపారు. ఎయిర్ ట్యాక్సీ ప్రత్యేకతలు ఆయన మాటల్లోనే.. వాయు రవాణారంగంలో సరికొత్త శకం మొదలుకానుంది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఈ–కామర్స్ వృద్ధి వంటి కారణంగా ప్రజలు, వస్తువులకు వేగవంతమైన, సురక్షితమైన, సరసమైన రవాణావిధానం అవసరం. దీనికి అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యూఏఎం) పరిష్కారం చూపిస్తుంది. 2030 నాటికి యూఏఎం ఎయిర్‌క్రాఫ్ట్ మార్కెట్ దాదాపు 25–30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని పరిశ్రమవర్గాల అంచనా. ఎయిర్ ట్యాక్సీ అంటే.. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (ఈవీటీఓఎల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్ ట్యాక్సీలని పిలుస్తారు. ఇవి ఎలక్ర్టిక్ బైక్‌లు, కార్ల లాగా బ్యాటరీలతో నడుస్తాయి. వీటికి హెలికాప్టర్ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సామర్థ్యంతో మిళితమై ఉంటాయి. కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని ఈ ఎయిర్ ట్యాక్సీలతో ట్రాఫిక్ రద్దీ, రణగొణ ధ్వనుల వంటి సమస్యలు ఉండవు. రాజేంద్రనగర్‌లో టెస్టింగ్ సెంటర్ ఎయిర్ ట్యాక్సీలను స్కైడ్రైవ్ జపాన్‌లో తయారు చేస్తుంది. పరిశోధనలు, అనుమతులు పూర్తయ్యాక.. విడిభాగాలను ఇండియాకు తీసుకొచ్చి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టెస్టింగ్ సెంటర్లో బిగిస్తామని మారుత్ డ్రోన్స్ సీఈఓ ప్రేమ్‌కుమార్ చెప్పారు. భవిష్యత్ అవసరాలకు సెంటర్‌ను విస్తరించేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. ఎయిర్ ట్యాక్సీ ప్రత్యేకతలివే.. సీటింగ్ సామర్థ్యం : 3 సీట్లు (ఒక పైలెట్+ ఇద్దరు ప్రయాణికులు) కొలతలు: 13 మీటర్లు*13 మీటర్లు*3 మీటర్లు యంత్రాలు: 12 మోటార్లు/రోటర్లు గరిష్ట టేకాఫ్ బరువు: 1.4 టన్నులు (3,100 ఎల్బీఎస్) గరిష్ట వేగం: గంటకు వందకిలోమీటర్లు గరిష్ట ఫ్లయిట్ రేంజ్: 15 కి.మీ. ఇదీ స్కైడ్రైవ్ కథ.. జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్ 2018లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ రోజువారీ రవాణాగా ఈవీటీఓఎల్‌ను వినియోగించేలా చేయడం దీని లక్ష్యం. 2019లో జపాన్‌లో జరిగిన తొలి ఈవీటీఓఎల్ విమాన పరీక్షలో స్కైడ్రైవ్ విజయం సాధించింది. వచ్చే ఏడాది జపాన్‌లోని ఒసాకాలో జరగనున్న అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (ఏఏఎం) ప్రాజెక్ట్ పాల్గొనేందుకు స్కైడ్రైవ్ అర్హత సాధించింది. ఈ ఏడాది సుజుకి మోటార్ కంపెనీకి చెందిన ప్లాంట్‌లో స్కైడ్రైవ్ ఎయిర్ ట్యాక్సీల ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మారుత్ డ్రోన్ కథ.. సామాజిక సమస్యలకు డ్రోన్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మారుత్ డ్రోన్స్ ప్రత్యేకత. ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు 2019లో దీనిని ప్రారంభించారు. తాజా ఒప్పందంలో ప్రదర్శన, వాణిజ్య విమానాల కార్యకలాపాలకు స్థానిక ప్రభుత్వం నుంచి మినహాయింపులు, ధ్రువీకరణ పత్రాలు పొందడంతోపాటు పైలెట్, మెకానిక్ శిక్షణ వంటి వాటిల్లో మారుత్ డ్రోన్స్‌ది కీలకపాత్ర. ఎయిర్ ట్యాక్సీలకు నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేయడం, కస్టమర్లను గుర్తించడం, ఎయిర్‌ఫీల్డ్‌ల భద్రత, అవసరమైన మౌలిక సదుపాయాలకు సహకరించడం వంటివి వాటిలోనూ భాగస్వామ్యమవుతుంది. -
మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ ఎంవోయూ
హైదరాబాద్: మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వ్యాపారాభివృద్ధితోపాటు, ఎలక్ట్రిక్ వెరి్టక్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటాల్) ఎయిర్‌క్రాఫ్ట్ (ఎయిర్ ట్యాక్సీ/ఫ్లయింగ్ ట్యాక్సీ) విభాగంలో అవకాశాల అన్వేషణకు ఇది వీలు కల్పించనుంది. తప్పనిసరి మినహాయింపులు, సరి్టఫికెట్లను సొంతం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ మద్దతు పొందడం, పైలట్, మెకానిక్‌లకు శిక్షణ, కీలక భాగస్వాముల గుర్తింపు విషయంలో మారుత్ డ్రోన్స్‌కు ఈ సహకారం తోడ్పడనుంది. మారుత్ డ్రోన్స్ ఇప్పటికే డ్రోన్ల కోసం అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఎంఎవోయూతో ఎయిర్‌ట్యాక్సీ కార్యకలాపాల్లోకీ విస్తరించనుంది. -
దేశంలో ఎగిరే టాక్సీలకి తొలిగిన అడ్డంకి
మన దేశంలో రాబోయే కాలంలో నగర రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కావచ్చు. దేశంలో డ్రోన్(Drone) కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన 2021 డ్రోన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్ నిబంధనలు-2021(Drone Rules) పేరిట వీటిని విడుదల చేసింది. "ఎయిర్ టాక్సీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోదనలు జరుగుతున్నాయి.. దీనికోసం అనేకా స్టార్టప్ లు ముందుకు వస్తున్నాయి. మీరు రోడ్లపై చూసే ఉబెర్ టాక్సీల వలే, కొత్త డ్రోన్ పాలసీ కింద మీరు గాలిలో ఎగిరే టాక్సీలను చూసే సమయం చాలా దూరంలో లేదు. త్వరలోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా' అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం.. డ్రోన్ల ఆపరేషన్ కోసం లైసెన్స్ నమోదు లేదా జారీ చేయడానికి ముందు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు. అంతేగాకుండా, ఈ లైసెన్స్ ఫీజులను గణనీయంగా తగ్గించారు. కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. డ్రోన్లు గరిష్ఠంగా మోసుకెళ్లే సామర్ధ్యాన్ని 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది. ఆపరేటర్ నుంచి వసూలు చేసే ఫీజుల రకాలను 72 నుంచి నాలుగుకు తగ్గించింది. ఇక అన్ని డ్రోన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారం ద్వారా జరుగుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సిఫారసు చేసే నిబంధనలకు అనుగుణంగా అన్ని డ్రోన్ ట్రైనింగ్, పరీక్షలు నిర్వహించబడతాయి.(చదవండి: అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!) జర్మన్ ఫ్లయింగ్ టాక్సీ స్టార్టప్ వోలోకాప్టర్ 2024 పారిస్ లో జరిగే ఒలింపిక్స్ సమయానికి తన ఎయిర్ టాక్సీని అందుబాటులోకి తీసుకొనిరావలని చూస్తుంది. భారీ డ్రోన్ లాగా కనిపించే ఈ ఎగిరే టాక్సీ రెండు సీట్లను కలిగి ఉంటుంది. ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులు కూడా ఈ రంగంలో ఆసక్తిని కనబరుస్తున్నారు సింధియా అన్నారు. హ్యుందాయ్ 2025 నాటికి తన ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ దక్షిణ కొరియా కంపెనీ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీల పనిచేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే పట్టణ కేంద్రాల నుంచి విమానాశ్రయాలకు ఐదు నుంచి ఆరు మందిని రవాణా చేయగలదు. -
భారత్‌లో మొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు
చండీగఢ్: దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్‌లో ప్రారంభమయ్యింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. రెండో దశలో హిసార్ నుంచి డెహ్రాడూన్ వరకు మరో ఎయిర్ ట్యాక్సీని వచ్చేవారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మూడో దశలో చండీగఢ్ నుంచి డెహ్రాడూన్, హిసార్ నుంచి ధర్మశాల వరకు ఈ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిమ్లా, కులూతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం ఇందులో చేర్చాలని యోచిస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ కోసం టెక్నామ్ పీ2006టీ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ప్రయాణ చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వనుంది. మెట్రో 2 టైర్, 3 టైర్ నగరాలను ఎయిర్ ట్యాక్సీలతో అనుసంధానిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. చదవండి: ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం ‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని’ -
ఎహాంగ్ ఎయిర్ ట్యాక్సీ వచ్చేస్తోంది...
చాలాకాలం నుంచి వింటున్న మాటేగానీ.. కొంచెం ముందుకెళ్లాం కాబట్టి ఈ ఎగిరే డ్రోన్ల గురించి మళ్లీ చెప్పుకోవాల్సి వస్తోంది. విషయం ఏమిటంటే.. ఎహాంగ్ అని ఓ కంపెనీ ఉందిలెండి... ఫొటోలో కనిపిస్తున్న డ్రోన్‌ను తయారు చేసింది ఈ కంపెనీనే. ఇప్పటికే దీన్ని చాలాసార్లు ప్రయోగించి చూశారుగానీ.. ఇటీవల కొంతమందిని దీంట్లోకి ఎక్కించి ప్రయోగం చేయడంతో డ్రోన్లు.. ఎయిర్ ట్యాక్సీల విషయం మళ్లీ చర్చకు వచ్చింది. ఎయిర్‌బస్, ఇంటెల్, బోయింగ్, బెల్హెలికాప్టర్స్ వంటి అనేక సంస్థలు తామూ డ్రోన్లతో ట్యాక్సీ సర్వీసులు నడుపుతామని అంటున్న నేపథ్యంలో ఎహాంగ్ ఒక అడుగు మందుకేసి తొలిసారి మనుషులతో ప్రయోగాలు నిర్వహించడం విశేషం. కంపెనీ సిఈవో హుఝీ హూ, చైనా ప్రభుత్వ అధికారులు కొందరు ఎహాంగ్ 184లో ప్రయాణించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారైన ఎహాంగ్ – 184 గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారీ స్థాయి తుపాను గాలులను కూడా తట్టుకుని ఇది 25 నిమిషాలపాటు గాల్లో ఎగరగలదు. భూమికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ప్రయాణించే ఎహాంగ్ను మరింత విస్తృత స్థాయిలో పరీక్షించి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామని అంటున్నారు కంపెనీ సీఈవో హూ! -
గాలిలో షికారు
ఒకవైపు డ్రైవర్లు లేని కార్లు, లారీలు రోడ్లెక్కుతున్నాయా! ఇంకోవైపు డ్రోన్లను చిన్న చిన్న ఎగిరే కార్లుగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందా! ఈ మధ్యలో... అసలు ఎగిరే కార్లకు డ్రైవర్లు ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది ఇజ్రాయెల్‌కు చెందిన టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఓ కాల్ చేస్తే ఇంటిపైకి ఎగిరే కారు వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కేసి? ఎక్కడికెళ్లాలో చెబితే చాలు. నిమిషాల్లో మీరు గమ్యం చేరిపోవచ్చు అంటోంది ఈ కంపెనీ. వట్టి మాటలతోనే సరిపెట్టలేదు ఈ టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఫొటోలో కనిపిస్తోందే... ఎయిర్మ్యూల్ ఎయిర్ ట్యాక్సీ... దాన్ని ఈ మధ్యే విజయవంతంగా నడిపి చూసింది కూడా. రెండు లేజర్ ఆల్టీమీటర్లు (ఎత్తును కొలిచేందుకు వాడే యంత్రాలు), ఇంకో రాడార్ ఆల్టీమీటర్, కదలికల్ని గుర్తించే ఇనర్షియల్ సెన్సర్లతోపాటు నిట్టనిలువుగా గాలిలోకి ఎగిరేందుకు అవసరమైన మోటార్లు, రోటర్ బ్లేడ్లున్నారుు దీంట్లో. దీంతోపాటు ఒక పైలట్‌లా ఎప్పటికప్పుడు ఏ దిక్కుకు, ఎంత వేగంతో, ఎలాంటి కోణంలో ప్రయాణించాలి లాంటి నిర్ణయాలన్నీ తీసుకునేందుకు దీంట్లో ప్రత్యేక ఫ్లైట్మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ‘ఇంకేముంది! ఎలాగూ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు కదా! త్వరలోనే వీటిని మనమూ చూడవచ్చా?’ అంటే... కొంచెం ఓపిక పట్టాలి అంటోంది సంస్థ. తొలి ప్రయత్నం విజయవంతమైనప్పటికీ అందులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. అత్యవసర సందర్భాల్లో ఈ పైలట్ లెస్ ఎయిర్ ట్యాక్సీ ఉపయోగం చెప్పే నమూనా చిత్రం ఫ్లైట్ మేనేజ్మెంట్ వ్యవస్థ మూడు సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోలేదని ఆ సంస్థ అంటోంది. రెండుసార్లు లేజర్ ఆల్టీమీటర్ రీడింగ్స తప్పుగా వచ్చాయట. ఫలితంగా ప్రయాణాన్ని కొంచెం ముందుగానే నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించిన తరువాత మరిన్ని పరీక్షలు నిర్వహించి, వీటిని విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటోంది టాక్టికల్ రోబోటిక్స్. అన్నట్లు... తాజాగా ఇంకో విషయం... కంపెనీ తన వాహనం పేరును ఇప్పుడు ఎయిర్మ్యూల్ నుంచి కొమరాంట్ అని మార్చేసింది! -
క్యాబ్ ఎందుకు?? హెలికాప్టర్ బుక్ చేద్దాం!!
2016, అక్టోబర్ 24.. మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లాలి.. కిశోర్ స్మార్ట్‌ఫోన్ తీశాడు.. క్యాబ్ బుక్ చేశాడు.. 2020, అక్టోబర్ 24.. మధ్యాహ్నం బంధువుల ఇంటికి వెళ్లాలి.. కిశోర్ మళ్లీ స్మార్ట్‌ఫోన్ తీశాడు.. అయితే.. ఈసారి హెలికాప్టర్(ఎయిర్ ట్యాక్సీ) బుక్ చేశాడు.. ఫ్రాన్స్ ఏరోస్పేస్ దిగ్గజం ‘ఎయిర్‌బస్’ చేపడుతున్న ప్రాజెక్టు వాహన విజయవంతమైతే.. స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పుడు ట్యాక్సీలు బుక్ చేసుకున్నట్లు ఎగిరే ట్యాక్సీలు బుక్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ జామ్‌ల వంటి సమస్యలు కూడా ఉండవు. హెలికాప్టర్ తరహాలో ఉండే ఈ ‘వాహన’లో ఒకరు ప్రయాణించవచ్చు. డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా నిర్దేశిత ప్రదేశానికి వెళ్తుంది. ‘దీనికి రన్‌వే అవసరం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్.. దారిలో ఉన్న ఇతర ఎయిర్ ట్యాక్సీలు, ప్రతిబంధకాలను గుర్తించే వ్యవస్థ ఇందులో ఉంటుంది. దాని వల్ల ప్రమాదాల ప్రశ్నే తలెత్తదు. పైలట్ అవసరం లేని తొలి సర్టిఫైడ్ ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా దీన్ని రూపొందించనున్నాం’ అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాడిన్ లేసాఫ్ తెలిపారు. 2017 చివరికి పూర్తి స్థాయి నమూనాను తయారుచేసి పరీక్షించనున్నారు. 2020లో మార్కెట్లోకి తేనున్నారు. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం నగరాల్లోనే నివసిస్తారని ఎయిర్‌బస్ అంచనా వేస్తోంది. దానికి తగ్గట్లు ట్రాఫిక్ సమస్య కూడా మరింత జటిలమవుతుందని అంటూ.. 2015 నాటికే మెగాసిటీలుగా ఉన్నవాటిని, 2030 నాటికి మెగాసిటీలుగా మారేవాటిని ఎయిర్‌బస్ గుర్తించింది. 2030 నాటికి మెగా సిటీలుగా మారేవాటిలో హైదరాబాద్ కూడా ఉంది. 2015లో నగర జనాభాను 89 లక్షలుగా పేర్కొన్న ఎయిర్ బస్.. 2030 నాటికి అది 1.27 కోట్లు అవుతుందని అంచనా వేసింది. అంటే.. ఎయిర్‌ట్యాక్సీలు మన మార్కెట్లోకి కూడా వచ్చే చాన్సుందన్నమాట.