ఎహాంగ్ ఎయిర్ ట్యాక్సీ
చాలాకాలం నుంచి వింటున్న మాటేగానీ.. కొంచెం ముందుకెళ్లాం కాబట్టి ఈ ఎగిరే డ్రోన్ల గురించి మళ్లీ చెప్పుకోవాల్సి వస్తోంది. విషయం ఏమిటంటే.. ఎహాంగ్ అని ఓ కంపెనీ ఉందిలెండి... ఫొటోలో కనిపిస్తున్న డ్రోన్‌ను తయారు చేసింది ఈ కంపెనీనే. ఇప్పటికే దీన్ని చాలాసార్లు ప్రయోగించి చూశారుగానీ.. ఇటీవల కొంతమందిని దీంట్లోకి ఎక్కించి ప్రయోగం చేయడంతో డ్రోన్లు.. ఎయిర్ ట్యాక్సీల విషయం మళ్లీ చర్చకు వచ్చింది. ఎయిర్‌బస్, ఇంటెల్, బోయింగ్, బెల్‌హెలికాప్టర్స్ వంటి అనేక సంస్థలు తామూ డ్రోన్లతో ట్యాక్సీ సర్వీసులు నడుపుతామని అంటున్న నేపథ్యంలో ఎహాంగ్ ఒక అడుగు మందుకేసి తొలిసారి మనుషులతో ప్రయోగాలు నిర్వహించడం విశేషం.
కంపెనీ సిఈవో హుఝీ హూ, చైనా ప్రభుత్వ అధికారులు కొందరు ఎహాంగ్ 184లో ప్రయాణించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారైన ఎహాంగ్ – 184 గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారీ స్థాయి తుపాను గాలులను కూడా తట్టుకుని ఇది 25 నిమిషాలపాటు గాల్లో ఎగరగలదు. భూమికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ప్రయాణించే ఎహాంగ్‌ను మరింత విస్తృత స్థాయిలో పరీక్షించి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తామని అంటున్నారు కంపెనీ సీఈవో హూ!
Comments
Please login to add a commentAdd a comment