
విమానం.. పడవ ప్రయాణం..!
గాల్లో ఎగరాల్సిన విమానం ఇలా నీటిపైకి వచ్చిందేంటి అని అనుకుంటున్నారా? మీకే కాదు.. చాలా మందికి ఈ డౌట్ వచ్చింది. అందుకే అందరూ నోరెళ్లబెట్టి చూడ్డం మొదలుపెట్టారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఈ విమానానికి ముప్పై ఏళ్లొచ్చాయి. దీంతో మూలనపడింది. ఇన్నేళ్లు సర్వీసు చేసిన ఈ బోయింగ్ ప్రయాణికుల విమానం రిటైర్ కావడంతో డేవిడ్ మెక్ గోవెన్ అనే వ్యాపారవేత్త 16 వేల యూరోలు పెట్టి దీన్ని కొన్నాడు. ఐర్లండ్‌లోని షానోన్ ఎయిర్‌పోర్టు నుంచి స్లిగో పట్టణానికి తీసుకెళ్లాలనుకున్నాడు. ట్రక్కులో తీసుకెళ్దామనుకుంటే.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అధికారులు అనుమతి నిరాకరించడంతో ఇలా జలమార్గాన్ని ఆశ్రయించాడు. దీన్ని తన రిసార్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉపయోగించుకోవాలని డేవిడ్ యోచిస్తున్నాడు.