Waterway
-
విమానం.. పడవ ప్రయాణం..!
గాల్లో ఎగరాల్సిన విమానం ఇలా నీటిపైకి వచ్చిందేంటి అని అనుకుంటున్నారా? మీకే కాదు.. చాలా మందికి ఈ డౌట్ వచ్చింది. అందుకే అందరూ నోరెళ్లబెట్టి చూడ్డం మొదలుపెట్టారు. ఇంతకీ విషయమేమిటంటే.. ఈ విమానానికి ముప్పై ఏళ్లొచ్చాయి. దీంతో మూలనపడింది. ఇన్నేళ్లు సర్వీసు చేసిన ఈ బోయింగ్ ప్రయాణికుల విమానం రిటైర్ కావడంతో డేవిడ్ మెక్ గోవెన్ అనే వ్యాపారవేత్త 16 వేల యూరోలు పెట్టి దీన్ని కొన్నాడు. ఐర్లండ్‌లోని షానోన్ ఎయిర్‌పోర్టు నుంచి స్లిగో పట్టణానికి తీసుకెళ్లాలనుకున్నాడు. ట్రక్కులో తీసుకెళ్దామనుకుంటే.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అధికారులు అనుమతి నిరాకరించడంతో ఇలా జలమార్గాన్ని ఆశ్రయించాడు. దీన్ని తన రిసార్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉపయోగించుకోవాలని డేవిడ్ యోచిస్తున్నాడు. -
పోలవరం నుంచి మహారాష్ట్రకు జలమార్గం
ఖమ్మం: పోలవరం నుంచి మహారాష్ట్ర వరకు గోదావరి నదిపై జలమార్గం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూజలమార్గంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా బీజం పడుతుందన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులు జలమార్గానికి అనుకూలంగా ఉండేలా నిర్మాణం చేస్తామని చెప్పారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు, కొత్తగూడెం- సత్తుపల్లి రైల్వేలైన్ పై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఇవి త్వరిత గతిన వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ ను గెలిపించాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. - -
జలమార్గం ద్వారా కలప రవాణా
చెన్నూర్ : కలప రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. నిన్న మొ న్నటి వరకు జీపులు, వాహనాలు వినియోగించి కలపను తరలించిన స్మగ్లరు ఇప్పుడు జలమార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాణహిత నది గుండా పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో టేకు కలప లేకుం డా చేసిన స్మగ్లర్లు మహారాష్ట్ర కలపపై కన్నేశారు. మహారాష్ట్ర, చత్తీష్‌గఢ్ రాష్ట్రా ల్లో టేకు వనాలు విరివిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి నెలకు రూ.కోటికి పైగా విలువ గల కలప అక్రమంగా రవా ణా అవుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు తుపాకులతో సైతం గస్తీలు ఏర్పాటు చేసి నిఘా ఉంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. స్మగర్లు ఫారెస్ట్ అధికారులపై ఎదురుదాడులకు దిగుతూ కలప రవాణా సాగిస్తున్నారు. రవాణా సాగుతుందిలా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అంకిస, లంకచేను, మొండిగుట్ట, చత్తీష్‌గఢ్ రాష్ట్రంలోని దమ్మూర్, కొత్తపల్లి, నడికూడ గ్రామాల మీదుగా ప్రాణహిత నది నుంచి జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాలకు, కరీంగనర్ జిల్లాలోని మహాదేవపూర్, మహాముత్తారం మండలాలకు కలప రవాణా అవుతోంది. స్మగ్ల ర్లు కలప దుంగలను తెట్టెలు కట్టి నదిలో వేస్తారు.ప్రవాహం ద్వారా అవి దిగువ ప్రాంతంలో ఉన్న వేమనపల్లి, నీల్వాయి, కోటపల్లి మండలంలోని అన్నారం, కరీం నగర్ జిల్లాలోని మహాదేవపూర్, సంకెపరిమెల, మంథని, పోతారం గ్రామాలకు చేరుతాయి. నది నుంచి వచ్చిన కలపను తీసి వారి అనుచరులు పట్టణ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. రవాణా చేసేది తెలంగాణ స్మగ్లరే.. మహారాష్ట్ర, చత్తీష్గఢ్ల నుంచి కలప రవాణా సాగిస్తున్న వారంతా తెలంగాణ స్మగ్లర్లేనని రెండు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మూడేళ్లుగా ఈ దం దా నిర్వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం -ప్రభాకర్‌రావు, డీఎఫ్‌వో, మంచిర్యాల మహారాష్ట్ర నుంచి వచ్చే కలపను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. -
రవాణాకు పోలవరం
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గోదావరి మీదుగా జలమార్గం ఏర్పడనుంది. నీటిలోతు సుమారు వందమీటర్లు ఉంటేనే లాంచీలో ప్రయాణం సాధ్యమవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మితమైతే ఆ మేరకు నీరు నిల్వ చేయవచ్చు. రోడ్డు, రైలుమార్గం కంటే జలమార్గం ద్వారా ప్రయాణికులకు దూరం తగ్గుతుంది. పేరంటాలపల్లి, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలను చూసే వీలవుతుందని సర్వే అధికారులు నిర్ధారించారు. 2012లో ఐడబ్ల్యూఏఐ (ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సంస్థ చీఫ్ శ్రీవాత్సవ రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు లాంచీలో ప్రయాణించి జలమార్గాన్ని పరిశీలించారు. అదేఏడాది రెండుసార్లు జలమార్గం కోసం సర్వే నిర్వహించారు. 2013లో ఢిల్లీ, నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ ఐడబ్ల్యూఏఐ సర్వే నిర్వహించింది. ఆ తర్వాతహైదరాబాద్కు చెందిన ఐఐసీ (ఇంటెలిజన్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్) అనే కాంట్రాక్టు సంస్థ అధికారులు కూడా సర్వే చేశారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు మండల పరిధిలోని వింజరం రేవు మీదుగా సర్వే నిర్వహించిన అధికారులు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ద్వారా నీటిలోతు, నది ఒడ్డు కొలతలను నమోదు చేసుకున్నారు. భద్రాచలం బ్రిడ్జి నుంచి రాజమండ్రి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వరకు గోదావరి 157 కిలో మీటర్లు, నది ఒడ్డు 171కి.మీ ఉందని అప్పట్లో సర్వే చేసిన ఐఐసీ అధికారులు తేల్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోచవరం, పాపికొండలు వద్ద 59 మీటర్లు, కచ్చులూరు వద్ద గోదావరిలో 60 మీటర్ల లోతు ఉంది. కుక్కునూరు మండలం వింజరంలో ఆరు మీటర్ల లోతే ఉందని నిర్ధారించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆ లోతు సుమారు వందమీటర్లకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి రోడ్డు ప్రయాణం 209 కి.మీ, భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రికి 185 కి,మీలు ఉంది. జలమార్గం ద్వారా ఆ దూరం 157 కి. మీ.లకు తగ్గుతుంది. దీనిద్వారా ప్రయాణ సమయం ఆదా అవుతుందని, రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని, ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని సర్వే అధికారులు పేర్కొన్నారు. పేరంటాలపల్లి, పాపికొండల యాత్రికులకు ఇది కలిసివస్తుందని అభిప్రాయపడ్డారు.