జలమార్గం ద్వారా కలప రవాణా
చెన్నూర్ : కలప రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. నిన్న మొ న్నటి వరకు జీపులు, వాహనాలు వినియోగించి కలపను తరలించిన స్మగ్లరు ఇప్పుడు జలమార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాణహిత నది గుండా పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో టేకు కలప లేకుం డా చేసిన స్మగ్లర్లు మహారాష్ట్ర కలపపై కన్నేశారు.
మహారాష్ట్ర, చత్తీష్‌గఢ్ రాష్ట్రా ల్లో టేకు వనాలు విరివిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి నెలకు రూ.కోటికి పైగా విలువ గల కలప అక్రమంగా రవా ణా అవుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు తుపాకులతో సైతం గస్తీలు ఏర్పాటు చేసి నిఘా ఉంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. స్మగర్లు ఫారెస్ట్ అధికారులపై ఎదురుదాడులకు దిగుతూ కలప రవాణా సాగిస్తున్నారు.
రవాణా సాగుతుందిలా..
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అంకిస, లంకచేను, మొండిగుట్ట, చత్తీష్‌గఢ్ రాష్ట్రంలోని దమ్మూర్, కొత్తపల్లి, నడికూడ గ్రామాల మీదుగా ప్రాణహిత నది నుంచి జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాలకు, కరీంగనర్ జిల్లాలోని మహాదేవపూర్, మహాముత్తారం మండలాలకు కలప రవాణా అవుతోంది. స్మగ్ల ర్లు కలప దుంగలను తెట్టెలు కట్టి నదిలో వేస్తారు.ప్రవాహం ద్వారా అవి దిగువ ప్రాంతంలో ఉన్న వేమనపల్లి, నీల్వాయి, కోటపల్లి మండలంలోని అన్నారం, కరీం నగర్ జిల్లాలోని మహాదేవపూర్, సంకెపరిమెల, మంథని, పోతారం గ్రామాలకు చేరుతాయి. నది నుంచి వచ్చిన కలపను తీసి వారి అనుచరులు పట్టణ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు.
రవాణా చేసేది తెలంగాణ స్మగ్లరే..
మహారాష్ట్ర, చత్తీష్‌గఢ్‌ల నుంచి కలప రవాణా సాగిస్తున్న వారంతా తెలంగాణ స్మగ్లర్లేనని రెండు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మూడేళ్లుగా ఈ దం దా నిర్వహిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం
-ప్రభాకర్‌రావు, డీఎఫ్‌వో, మంచిర్యాల
మహారాష్ట్ర నుంచి వచ్చే కలపను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం.