విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహం | China launches CubeSats satellites for tracking aircraft | Sakshi
Sakshi News home page

విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహం

Published Thu, Oct 8 2015 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహం

విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహం

బీజింగ్: పౌర విమానాలు, నౌకలను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగపడే మూడు క్యూబ్ శాటిలైట్లను(క్యూబ్‌శాట్స్) చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఆచూకీ లేకుండా పోయిన ఎమ్‌హెచ్370 విమానం లాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి వీటి ద్వారా వీలవుతుందని భావిస్తోంది.

ఎస్‌టీయూ-2గా పిలుస్తున్న ఈ క్యూబ్‌శాట్స్‌ను సెప్టెంబర్ 25న ప్రయోగించగా, అవి నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయని మిషన్ చీఫ్ డిజైనర్ యూ షుఫాన్ తెలిపారు. కేవలం 6.8కిలోల బరువున్న ఈ ఉపగ్రహాల్లో ధ్రువ ప్రాంతాల పరిశీలన కెమెరాలు, 'ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైవలెన్స్ బ్రాడ్‌కాస్ట్(ఏడీఎస్-బి)' రిసీవర్లను అమర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement