China launches
-
చరిత్ర సృష్టించిన చాంగ్యీ–6
బీజింగ్: చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(సీఎన్ఎస్ఏ) సరికొత్త చరిత్ర సృష్టించింది. చందమామపై మనకు కనిపించని అవతలివైపు భాగం నుంచి మట్టి నమూనాలను విజయవంతంగా భూమిపైకి తీసుకొచి్చంది. చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ మాడ్యూల్ చాంగ్యీ–6 జాబిల్లి నుంచి మట్టిని మోసుకొని స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటల సమయంలో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో క్షేమంగా దిగింది. చంద్రుడి అవతలి వైపు భాగంలోని మట్టిని భూమిపైకి సురక్షితంగా చేర్చిన మొట్టమొదటి దేశంగా చైనా రికార్డుకెక్కింది.చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. చాంగ్యీ–6 మిషన్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని సీఎన్ఎస్ఏ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైనా అధినేత షీ జిన్‌పింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలిపారు. చాంగ్యీ–6 వ్యోమనౌక ఈ ఏడాది మార్చి 3న జాబిల్లి దిశగా తన ప్రస్థానం ప్రారంభించింది. ఇందులో అర్బిటార్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే భాగాలు ఉన్నాయి.53 రోజులపాటు అవిశ్రాంతంగా ప్రయాణం సాగించి, జూన్ 2న చందమామ దక్షిణ ధ్రువంలోని సౌత్‌పోల్–అయిట్కెన్(ఎస్పీఏ) ప్రాంతంలో సురక్షితంగా దిగింది. రోబోటిక్ హస్తం సాయంతో రెండు రోజులపాటు మట్టి నమూనాలను సేకరించిన అసెండర్ జూన్ 4న తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. జూన్ 6న భూకక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్బిటార్–రిటర్నర్కు మట్టి నమూనాలను బదిలీ చేసింది.భూమిపై అడుగుపెట్టడానికి తగిన సమయం కోసం వేచి చూస్తూ ఆర్బిటార్–రిటర్నర్ 13 రోజలపాటు కక్ష్యలోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు మంగళవారం భూమిపైకి క్షేమంగా చేరుకుంది. అరుదైన మట్టి నమూనాలను తీసుకొచి్చంది. వీటిలో వేల ఏళ్ల నాటి అగి్నపర్వత శిలలు కూడా ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు దీటుగా చైనా దూసుకెళ్తోంది. 2030 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపించబోతున్నామని గతంలోనే ప్రకటించింది. -
లీకైన రెడ్మి కే 20 సిరీస్.. ఫీచర్లు ఇవే..!
బీజింగ్ : దిగ్గజ మొబైల్ బ్రాండ్ షియోమి రెడ్మి అత్యాధునిక ఫీచర్లతో కే20, కే20 ప్రో డివైజ్‌లను ఈనెల 28న చైనా మార్కెట్లో లాంఛ్ చేయనుంది. లాంఛ్‌కు ముందే ఈ రెండు ప్రోడక్ట్‌ల ఫుల్ స్పెసిఫికేషన్ షీట్ ఆన్లైన్లో లీకై హల్చల్ చేస్తోంది. మరోవైపు భారత మార్కెట్లో రెడ్మి కే20 సిరీస్‌ను త్వరలో లాంఛ్ చేస్తామని షియోమి ఇండియా ప్రకటించింది. ఇక లీకైన స్పెసిఫికేషన్ షీట్ ప్రకారం రెడ్మి కే20 స్నాప్‌డ్రాగన్ 700 చిప్సెట్తో రానుండగా కే20 ప్రొ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌తో రానుంది. రెండు ఫోన్లు 2340=1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.39 ఇంచ్ ఎల్ఈడీ డిస్ప్లేతో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగిఉంటాయి. ఫ్లేమ్ రెడ్, గ్లేసియర్ బ్లూ, కార్బన్ ఫైబర్ బ్లాక్ రంగుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. రెడ్మి కే20 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కాగా, కే20 ప్రో 8 జీబ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో లభించనున్నాయి. -
విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహం
బీజింగ్: పౌర విమానాలు, నౌకలను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగపడే మూడు క్యూబ్ శాటిలైట్లను(క్యూబ్‌శాట్స్) చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఆచూకీ లేకుండా పోయిన ఎమ్హెచ్370 విమానం లాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి వీటి ద్వారా వీలవుతుందని భావిస్తోంది. ఎస్టీయూ-2గా పిలుస్తున్న ఈ క్యూబ్‌శాట్స్‌ను సెప్టెంబర్ 25న ప్రయోగించగా, అవి నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయని మిషన్ చీఫ్ డిజైనర్ యూ షుఫాన్ తెలిపారు. కేవలం 6.8కిలోల బరువున్న ఈ ఉపగ్రహాల్లో ధ్రువ ప్రాంతాల పరిశీలన కెమెరాలు, 'ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైవలెన్స్ బ్రాడ్కాస్ట్(ఏడీఎస్-బి)' రిసీవర్లను అమర్చారు.