CubeSats
-
విమానాలను ట్రాక్ చేసే ఉపగ్రహం
బీజింగ్: పౌర విమానాలు, నౌకలను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగపడే మూడు క్యూబ్ శాటిలైట్లను(క్యూబ్‌శాట్స్) చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఆచూకీ లేకుండా పోయిన ఎమ్హెచ్370 విమానం లాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి వీటి ద్వారా వీలవుతుందని భావిస్తోంది. ఎస్టీయూ-2గా పిలుస్తున్న ఈ క్యూబ్‌శాట్స్‌ను సెప్టెంబర్ 25న ప్రయోగించగా, అవి నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయని మిషన్ చీఫ్ డిజైనర్ యూ షుఫాన్ తెలిపారు. కేవలం 6.8కిలోల బరువున్న ఈ ఉపగ్రహాల్లో ధ్రువ ప్రాంతాల పరిశీలన కెమెరాలు, 'ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైవలెన్స్ బ్రాడ్కాస్ట్(ఏడీఎస్-బి)' రిసీవర్లను అమర్చారు. -
మార్స్ వద్దకు బుల్లి ఉపగ్రహాలు పంపనున్న నాసా
వాషింగ్టన్: అంగారకుడిపైకి వచ్చే ఏడాది ఓ ల్యాండర్‌తో పాటు రెండు బుల్లి ఉపగ్రహాలు ‘క్యూబ్‌శాట్స్’ను కూడా పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఫుట్‌బాల్ బంతుల్లా చిన్నగా ఉండే ఈ క్యూబ్‌శాట్స్ ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇలాంటి క్యూబ్‌శాట్స్‌ను ఇప్పటికే పలువురు యూనివర్సిటీ విద్యార్థులు పలువురు తయారు చేయగా, నాసా వాటిని భూ కక్ష్యలోకి పంపింది. భారీ ఉపగ్రహాలతో పాటు ఇలాంటి చిన్న ఉపగ్రహాలను అదనంగా ప్రయోగించేందుకు వీలు అవుతుంది. వీటిని ల్యాండర్‌తో పాటు మార్స్ వద్దకు పంపడం విజయవంతం అయితే గనక.. మార్స్‌పై ల్యాండర్, రోవర్లు దిగిన వెంటనే వీలైనంత త్వరగా భూమికి వాటి సమాచారం చేరవేసేందుకు క్యూబ్‌శాట్స్ ఉపయోగపడతాయని నాసా భావిస్తోంది.