అంగారకుడిపైకి వచ్చే ఏడాది ఓ ల్యాండర్‌తో పాటు రెండు బుల్లి ఉపగ్రహాలు ‘క్యూబ్‌శాట్స్’ను కూడా పంపనున్నట్లు నాసా వెల్లడించింది.
వాషింగ్టన్: అంగారకుడిపైకి వచ్చే ఏడాది ఓ ల్యాండర్‌తో పాటు రెండు బుల్లి ఉపగ్రహాలు ‘క్యూబ్‌శాట్స్’ను కూడా పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఫుట్‌బాల్ బంతుల్లా చిన్నగా ఉండే ఈ క్యూబ్‌శాట్స్ ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇలాంటి క్యూబ్‌శాట్స్‌ను ఇప్పటికే పలువురు యూనివర్సిటీ విద్యార్థులు పలువురు తయారు చేయగా, నాసా వాటిని భూ కక్ష్యలోకి పంపింది.
భారీ ఉపగ్రహాలతో పాటు ఇలాంటి చిన్న ఉపగ్రహాలను అదనంగా ప్రయోగించేందుకు వీలు అవుతుంది. వీటిని ల్యాండర్‌తో పాటు మార్స్ వద్దకు పంపడం విజయవంతం అయితే గనక.. మార్స్‌పై ల్యాండర్, రోవర్‌లు దిగిన వెంటనే వీలైనంత త్వరగా భూమికి వాటి సమాచారం చేరవేసేందుకు క్యూబ్‌శాట్స్ ఉపయోగపడతాయని నాసా భావిస్తోంది.