Meet Kelly Haston Who Will Spend A Year On Mars - Sakshi
Sakshi News home page

‘అంగారకుడి’పై ఏడాది పాటు జీవనం.. ఇంతకీ ఎవరామె?

Published Sat, May 27 2023 12:26 PM | Last Updated on Sat, May 27 2023 1:04 PM

Canadian Woman Will Spend A Year On Mars - Sakshi

అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.  ఈలోపు అలాంటి వాతావరణమే భూమ్మీద సృష్టించి.. మనుషుల మీద ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఓ మహిళా సైంటిస్ట్‌ ఏడాదిపాటు అంగారకుడి వాతావరణంలో గడపనుంది.  

కెనడియన్‌ జీవ శాస్త్రవేత్త 52 ఏళ్ల కెల్లీ హాస్టన్‌కి మార్స్‌(అంగారకుడు)పై జీవించడం అనేది ఆమె చిన్ననాటి కల అట. అది ఇప్పుడూ ఆనుకోని విధంగా నెరవేరనుంది. ప్రస్తుతం హాస్టన్‌ అందుకోసం సన్నద్ధమవుతోంది. అంగారక గ్రహంపై వాతావరణాన్ని తట్టుకునేలా కసరత్తులు శిక్షణ తీసుకుంటోంది. జూన్‌ చివరి వారంలో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో  మార్టిన్‌ నివాస స్థలంలోకి(అంగారకుడిపై మాదిరి పరిస్థితులే ఉంటాయక్కడ) అడుగుపెట్టనున్నారు. అయితే.. ఆమె అక్కడికి ఒంటరిగానే వెళ్లడం లేదు. కూడా  నలుగురు వాలంటీర్లు ఉంటారు. 

భవిష్యత్తులో వివిధ వైవిధ్య పరిమిత వాతావరణంలో మానువుడి ఎదుర్కొనగల సామార్థ్యాన్ని అంచనా వేసేందుకు, అంతరిక్షంలో మానవుడి జీవనం గురిచి అధ్యయనం చేసేందుకు ఈ మిషన్‌ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు నాసా పేర్కొంది. ఇందులో గడిపే వారు అనేక రకాల సవాళ్ల తోపాటు, నీటి పరిమితులు ఎదుర్కొనక తప్పదని స్పేస్‌ ఏజెన్సీ హెచ్చరించింది. అలాగే బయట ప్రపంచం కమ్యూనికేషన్‌ ఉండదు. భూమి, అంగారకం గ్రహం మధ్య జీవన వ్యత్యాసం తెలియడమే గాక పరిస్థితులను తట్టకుని జీవింగలమా లేదన్నది అవగతమవుతుందని నాసా వెల్లడించింది. ఈ మార్స్‌(అంగారక గ్రహం)పై ఉండేందుకు మార్స్‌ డ్యూన్‌ అల్ఫాగా పిలిచే ఒక నివాస స్థలం ఉంటుంది. మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫాగా పిలచే త్రీడీ ప్రింటెడ్‌ 1700 చదరపు అడుగుల నివాస స్థలం, బెడ్‌రూమ్‌లు, వ్యాయామశాల తదితర సౌకర్యాలు ఉంటాయి. హాస్టన్‌కి నాసా నుంచి ఈ అవకాశం వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవడం తదితరాలు వెంటవెంటనే జరిగిపోయాయి.

ఈ మేరకు ఈ మిషన్‌లో ఆమె తోపాటు నలుగురు సభ్యులు ఆహారాన్ని పండించుకునేలా పొలం అన్ని ఉంటాయి. ఎయిర్‌ లాక్‌ చేయబడిన గదిలో అంతరిక్షంపై నడిచే విధానాన్ని ప్రాక్టీస్‌ చేయడమే గాక, సూట్‌ని ధరించగలిగి ఉండేలా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. మార్స్‌లోకి ప్రయాణించే వారిలో తాను ఉన్నట్లు నిర్థారించగానే ఆమె ఆనందానికి వదలి లేకుండా పోయింది,. తనతోపాటు అక్కడ ఒక  ఇంజనీర్‌, ఎమర్జెన్సీ డాక్టర్‌, నర్సు ఉంటారు. నాసా ఎంపిక చేసిన ఆయా వ్యక్తులు ఒకరికొకరూ పరిచయమే లేదు. అయితే మార్స్‌ కోసం హ్యూస్టన్‌ నివాస స్థలంలో ఉండనున్న హౌస్‌మేట్స్‌ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం అనేది అత్యంత కీలకం.

అలాగే అక్కడ గ్రహంపై గడిపే వారు తమ వ్యక్తిగత సమస్యలను పక్కనబెట్టి మరీ మిగతా హౌస్‌మేట్స్‌తో బ్యాలెన్స్‌ చేసుకుంటూ గడపాల్సి ఉంది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా అన్ని రోజులు ఉండగలమా? అనేది అత్యంత ఆందోళన కలిగించే అంశం. కేవలం ఈమెయిల్‌తోనే తన కుటుంబసభ్యులతో టచ్‌లో ఉండాల్సిందే. ఈ ప్రయోగాత్మక మిషన్‌ చాపే(క్రూ హెల్త్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అనలాగ్‌) పేరుతో నాసా ప్లాన్‌ చేసింది.

ఇదిలా ఉండగా, అంగారక గ్రహంపై ఏడాది పాటు జీవించగలిగే మిషన్‌ని 2015-2016లో హవాయిలోని నివాస స్థలంలో ప్రారంభం కానుంది. అమెరికా 2030 చివరినాటి కల్లా అంగారక గ్రహంపై యాత్రకు సిద్ధం చేసే ప్రయోగంలో భాగంగా సుదీర్ఘకాలం అక్కడ ఎలా జీవించగలం అనే దానిపై మిషన్‌ ప్రయోగాలు నిర్వహిస్తోంది. అంతేగాదు మానవులను చంద్రునిపైకి పంపే యోచన కూడా చేస్తున్నట్లు నాసా పేర్కొంది. కాగా, అంగారకుడి గ్రహంపై జీవించనున్న కెల్లీ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, నిజంగా అంగారకుడి వద్దకు వెళ్తున్నానా అని ఎగ్జైట్‌ అవుతోంది. 

(చదవండి: ఉక్రెయిన్‌ క్లినిక్‌పై క్షిపణి దాడి..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement