spends
-
ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ..!
కొందరు వృద్ధులు ఏజ్‌తో సంబంధం లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు . కుర్రాళ్ల మాదిరిగా వారి ఆలోచనలు, వ్యవహార శైలి ఉంటుంది. అది వారి ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఇలా వ్యవహరిస్తున్నారా..! లేక మరేదైనా అనేది తెలియదు. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధుడు లేటు వయసులో పెళ్లి కోసం ఆరాట పడుతూ ఏం చేస్తున్నాడో వింటే కంగుతింటారు.అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన గిల్బర్ట్ అనే 70 ఏళ్ల వ్యక్తి తనకు తగిన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాడు. తాను 2015 నుంచి ఒంటరిగా ఉంటున్నానని, అందుకే తనకు తగిన కలల భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు. తాను ఇటీవలే రిటైర్ అయ్యానని, మంచి ఆదాయం కూడా ఉందని తెలిపాడు. అంతేకాదు తనకు తగిన గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ బిల్‌బోర్డులపై భారీగాప్రకటనలు కూడా ఇస్తున్నాడు. అందుకోసం అతడు వారానికి సుమారు రూ. 33 వేలు దాక ఖర్చు పెడుతున్నాడట. తనకు యూరప్ అంటే చాలా ఇష్టమని, నిజాయితీగా ఉండే మంచి భాగ స్వామి కోసం యూకే వరకు చుట్టోస్తానని మరీ చెబుతున్నాడు. ఈ ప్రకటన కారణంగా అతడికి దాదాపు 400పైగా కాల్స్, ఇమెయిల్స్ వచ్చాయట. వారంతా తాను ధనవంతుడిగా భావించి పెళ్లి చేసుకునేందుకు వచ్చేవాళ్లని, అందుకు వారందర్నీ తాను తిరస్కరించానని చెబుతున్నాడు. తనకు నమ్మకమైన భాగస్వామి కావాలని అందుకోసం ఎంత దూరమైన వెళ్తాను, ఎంతకాలమైన ఎదురు చూస్తానని తెగేసి చెబుతున్నాడు. అంతేగాదు అందుకోసం ఎంత డభైనా వెచ్చించి బిల్‌బోర్డ్‌లో ప్రకటచ్చేందుకు వెనుకాడనని అంటున్నాడు గిల్బర్ట్. అంతేగాదు తన ఏజ్ కంటే చాల చిన్న ఏజ్ అయినా ఓకేనట. ఈ ఏజ్‌లో ఒంటరితనం జయించటం కోసం తగిన భాగస్వామిని కావాలనుకోవటం వరకు సరైన విషయమే. కానీ అందుకోసం ఇంతలా డబ్బు వెచ్చిస్తూ..తపన పడటం విడ్డూరంగా ఉంది కదూ.!(చదవండి: -
20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..
అంతర్జాతీయ వ్యయాలపై కేంద్రం పెంచిన 20 శాతం టీసీఎస్ (TCS) పన్ను అక్టోబర్ 1 నుంచే అమలు కానుంది. సరళీకృత రెమిటెన్స్ పథకం (LRS) కింద ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల పరిమితికి మించి చేసిన విదేశీ ఖర్చులపై మూలం వద్ద ఈ పన్నును వసూలు చేస్తారు. విద్య లేదా వైద్య సంబంధ చెల్లింపులు మినహా ఇతర విదేశీ ఖర్చులపై ఈ పన్నును కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా అక్టోబర్ 1 నుంచి 20 శాతం ఉంటుంది. LRS కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. LRS చెల్లింపులు, వారి వెల్లడించిన ఆదాయాల మధ్య వ్యత్యాసాలను గుర్తించిన ఆర్థిక శాఖ LRS కింద కొత్త టీసీఎస్ రేట్లను 2023 బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించింది. కొత్త రేట్లు వైద్య లేదా విద్యా ఖర్చులపై ఎటువంటి మార్పును తీసుకురానప్పటికీ, రియల్ ఎస్టేట్, బాండ్లు, విదేశీ స్టాక్‌లు, టూర్ ప్యాకేజీలు లేదా ప్రవాసులకు పంపే బహుమతులు వంటి వాటికి చేసే ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 206C, సబ్-సెక్షన్ 1G ప్రకారం.. LRS లావాదేవీలపై, విదేశీ టూర్ ప్యాకేజీల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం టీసీఎస్‌ను వసూలు చేస్తుంది. -
‘అంగారకుడి’పై ఏడాది పాటు జీవనం.. ఎవరామె?
అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఈలోపు అలాంటి వాతావరణమే భూమ్మీద సృష్టించి.. మనుషుల మీద ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఓ మహిళా సైంటిస్ట్ ఏడాదిపాటు అంగారకుడి వాతావరణంలో గడపనుంది. కెనడియన్ జీవ శాస్త్రవేత్త 52 ఏళ్ల కెల్లీ హాస్టన్కి మార్స్(అంగారకుడు)పై జీవించడం అనేది ఆమె చిన్ననాటి కల అట. అది ఇప్పుడూ ఆనుకోని విధంగా నెరవేరనుంది. ప్రస్తుతం హాస్టన్ అందుకోసం సన్నద్ధమవుతోంది. అంగారక గ్రహంపై వాతావరణాన్ని తట్టుకునేలా కసరత్తులు శిక్షణ తీసుకుంటోంది. జూన్ చివరి వారంలో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో మార్టిన్ నివాస స్థలంలోకి(అంగారకుడిపై మాదిరి పరిస్థితులే ఉంటాయక్కడ) అడుగుపెట్టనున్నారు. అయితే.. ఆమె అక్కడికి ఒంటరిగానే వెళ్లడం లేదు. కూడా నలుగురు వాలంటీర్లు ఉంటారు. భవిష్యత్తులో వివిధ వైవిధ్య పరిమిత వాతావరణంలో మానువుడి ఎదుర్కొనగల సామార్థ్యాన్ని అంచనా వేసేందుకు, అంతరిక్షంలో మానవుడి జీవనం గురిచి అధ్యయనం చేసేందుకు ఈ మిషన్ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు నాసా పేర్కొంది. ఇందులో గడిపే వారు అనేక రకాల సవాళ్ల తోపాటు, నీటి పరిమితులు ఎదుర్కొనక తప్పదని స్పేస్ ఏజెన్సీ హెచ్చరించింది. అలాగే బయట ప్రపంచం కమ్యూనికేషన్ ఉండదు. భూమి, అంగారకం గ్రహం మధ్య జీవన వ్యత్యాసం తెలియడమే గాక పరిస్థితులను తట్టకుని జీవింగలమా లేదన్నది అవగతమవుతుందని నాసా వెల్లడించింది. ఈ మార్స్(అంగారక గ్రహం)పై ఉండేందుకు మార్స్ డ్యూన్ అల్ఫాగా పిలిచే ఒక నివాస స్థలం ఉంటుంది. మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలచే త్రీడీ ప్రింటెడ్ 1700 చదరపు అడుగుల నివాస స్థలం, బెడ్రూమ్లు, వ్యాయామశాల తదితర సౌకర్యాలు ఉంటాయి. హాస్టన్కి నాసా నుంచి ఈ అవకాశం వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవడం తదితరాలు వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు ఈ మిషన్‌లో ఆమె తోపాటు నలుగురు సభ్యులు ఆహారాన్ని పండించుకునేలా పొలం అన్ని ఉంటాయి. ఎయిర్ లాక్ చేయబడిన గదిలో అంతరిక్షంపై నడిచే విధానాన్ని ప్రాక్టీస్ చేయడమే గాక, సూట్‌ని ధరించగలిగి ఉండేలా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. మార్స్‌లోకి ప్రయాణించే వారిలో తాను ఉన్నట్లు నిర్థారించగానే ఆమె ఆనందానికి వదలి లేకుండా పోయింది,. తనతోపాటు అక్కడ ఒక ఇంజనీర్, ఎమర్జెన్సీ డాక్టర్, నర్సు ఉంటారు. నాసా ఎంపిక చేసిన ఆయా వ్యక్తులు ఒకరికొకరూ పరిచయమే లేదు. అయితే మార్స్ కోసం హ్యూస్టన్ నివాస స్థలంలో ఉండనున్న హౌస్మేట్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం అనేది అత్యంత కీలకం. అలాగే అక్కడ గ్రహంపై గడిపే వారు తమ వ్యక్తిగత సమస్యలను పక్కనబెట్టి మరీ మిగతా హౌస్‌మేట్స్‌తో బ్యాలెన్స్ చేసుకుంటూ గడపాల్సి ఉంది. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా అన్ని రోజులు ఉండగలమా? అనేది అత్యంత ఆందోళన కలిగించే అంశం. కేవలం ఈమెయిల్‌తోనే తన కుటుంబసభ్యులతో టచ్‌లో ఉండాల్సిందే. ఈ ప్రయోగాత్మక మిషన్ చాపే(క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్) పేరుతో నాసా ప్లాన్ చేసింది. ఇదిలా ఉండగా, అంగారక గ్రహంపై ఏడాది పాటు జీవించగలిగే మిషన్‌ని 2015-2016లో హవాయిలోని నివాస స్థలంలో ప్రారంభం కానుంది. అమెరికా 2030 చివరినాటి కల్లా అంగారక గ్రహంపై యాత్రకు సిద్ధం చేసే ప్రయోగంలో భాగంగా సుదీర్ఘకాలం అక్కడ ఎలా జీవించగలం అనే దానిపై మిషన్ ప్రయోగాలు నిర్వహిస్తోంది. అంతేగాదు మానవులను చంద్రునిపైకి పంపే యోచన కూడా చేస్తున్నట్లు నాసా పేర్కొంది. కాగా, అంగారకుడి గ్రహంపై జీవించనున్న కెల్లీ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, నిజంగా అంగారకుడి వద్దకు వెళ్తున్నానా అని ఎగ్జైట్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్ క్లినిక్‌పై క్షిపణి దాడి..) -
సియాచిన్ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేసిన మోడీ పై చర్చ
-
నాన్నతోనే న్యూ ఇయర్
మనిషి ఆశా జీవి. ప్రేమ జీవి కూడా. అలాగే కోరికలు గుర్రాలపై స్వారీ చేస్తుంటాయి. స్వేచ్ఛా విహంగి కావాలని ఆశిస్తుంటారు. ఇక సెలెబ్రిటీల వారసుల విషయానికొస్తే స్వేచ్ఛ ఉన్నా సరైన రక్షణ మాత్రం కొరతనే చెప్పాలి. నటి శ్రుతిహాసన్ ఇటీవల అభిమాని నుంచి ఎదుర్కొన్న సంఘటనే ఉదాహరణ. ఒక ఆగంతకుడి దుస్సాహసం కారణంగా ఆమె భయభ్రాంతులకు గురైంది. దీంతోపాటు ఆమె తల్లిదండ్రులైన కమలహాసన్, సారికలను కలవరపరచింది. ఆ తరువాత శ్రుతిహాసన్ విషయంలో ఆమె తల్లి సారిక ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. శ్రుతిహాసన్‌ను సెల్ఫోన్లో కూడా మాట్లాడనీయకుండా ఆమె వ్యక్తిగత కార్యనిర్వాహకుడి ద్వారా సారికనే ప్రత్యుత్తరాలు సాగిస్తున్నారు. అయితే శ్రుతిహాసన్ గత కొంతకాలంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో యమ బిజీగా ఉన్నారు. పండుగలు, పబ్బాలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని భావిస్తారు. నూతన సంవత్సర వేడుకలను సొంత వారితో పంచుకోవాలని ఆశిస్తారు. అయితే శ్రుతిహాసన్ మాత్రం రెండేళ్లుగా న్యూ ఇయర్‌ను కుటుంబ సభ్యులకు దూరంగానే గడుపుతున్నారట. అయితే ఈ ఏడాది మాత్రం తన తండ్రి క మలహాసన్తో కలసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోనున్నారట. ఈ బ్యూటీ చెన్నైలో సందడి చేయనున్నారన్నమాట.