కొందరు వృద్ధులు ఏజ్‌తో సంబంధం లేకుండా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు . కుర్రాళ్ల మాదిరిగా వారి ఆలోచనలు, వ్యవహార శైలి ఉంటుంది. అది వారి ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఇలా వ్యవహరిస్తున్నారా..! లేక మరేదైనా అనేది తెలియదు. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధుడు లేటు వయసులో పెళ్లి కోసం ఆరాట పడుతూ ఏం చేస్తున్నాడో వింటే కంగుతింటారు.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన గిల్బర్ట్ అనే 70 ఏళ్ల వ్యక్తి తనకు తగిన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాడు. తాను 2015 నుంచి ఒంటరిగా ఉంటున్నానని, అందుకే తనకు తగిన కలల భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు. తాను ఇటీవలే రిటైర్ అయ్యానని, మంచి ఆదాయం కూడా ఉందని తెలిపాడు. అంతేకాదు తనకు తగిన గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ బిల్‌బోర్డులపై భారీగాప్రకటనలు కూడా ఇస్తున్నాడు. అందుకోసం అతడు వారానికి సుమారు రూ. 33 వేలు దాక ఖర్చు పెడుతున్నాడట.
తనకు యూరప్ అంటే చాలా ఇష్టమని, నిజాయితీగా ఉండే మంచి భాగ స్వామి కోసం యూకే వరకు చుట్టోస్తానని మరీ చెబుతున్నాడు. ఈ ప్రకటన కారణంగా అతడికి దాదాపు 400పైగా కాల్స్, ఇమెయిల్స్ వచ్చాయట. వారంతా తాను ధనవంతుడిగా భావించి పెళ్లి చేసుకునేందుకు వచ్చేవాళ్లని, అందుకు వారందర్నీ తాను తిరస్కరించానని చెబుతున్నాడు.
తనకు నమ్మకమైన భాగస్వామి కావాలని అందుకోసం ఎంత దూరమైన వెళ్తాను, ఎంతకాలమైన ఎదురు చూస్తానని తెగేసి చెబుతున్నాడు. అంతేగాదు అందుకోసం ఎంత డభైనా వెచ్చించి బిల్‌బోర్డ్‌లో ప్రకటచ్చేందుకు వెనుకాడనని అంటున్నాడు గిల్బర్ట్. అంతేగాదు తన ఏజ్ కంటే చాల చిన్న ఏజ్ అయినా ఓకేనట. ఈ ఏజ్‌లో ఒంటరితనం జయించటం కోసం తగిన భాగస్వామిని కావాలనుకోవటం వరకు సరైన విషయమే. కానీ అందుకోసం ఇంతలా డబ్బు వెచ్చిస్తూ..తపన పడటం విడ్డూరంగా ఉంది కదూ.!
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment