
విమానం రోడ్డెక్కితే..!
ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా విమానం వెళుతోందని అనుకుంటున్నారా? కానీ ఇది ఫ్లై ఓవర్ కాదు. విమానం రన్ వే! స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో రన్ వేలు ఇలా నగరంలోనే ఏర్పాటు చేయొచ్చంటూ అలెక్స్ సటన్ అనే ఆర్కిటెక్ట్ చెబుతున్నాడు.
నగరంపై మధ్యలో ఓ పెద్ద విమానాశ్రయం, దాని నుంచి పెద్ద పెద్ద భవనాల మధ్య ఖాళీ గుండా రన్ వేలను నిర్మించవచ్చని, ఈ పద్ధతి వల్ల విమానయాన రంగం రూపురేఖలే మారిపోతాయంటూ ఆ యువ ఆర్కిటెక్ట్ ప్రతిపాదిస్తున్నాడు. భలే ఉంది కదూ.. ఈ ప్రతిపాదన అమలైతే విమానాలు రయ్యిన దూసుకొస్తూ ఇళ్ల మధ్యే దిగిపోతాయన్నమాట!