బోయింగ్‌తో టాటా ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ అవసరాలకు కావల్సిన విమానాల తయారీకి సంబంధించి బోయింగ్‌తో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థలు కలిసి మానవరహిత విమానాలతో పాటు, ఇతర రక్షణ రంగానికి చెందిన విమానాలను అభివృద్ధి చేయనున్నాయి. ఈ మేరకు బుధవారం రెండు కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు టీఏఎస్‌ఎల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆదిభట్లలోని ఏరోస్పేస్ సెజ్‌లో జరిగిన కార్యక్రమంలో బోయింగ్ మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రెసిడెంట్ షెల్లీ లావెండర్, టీఏఎస్‌ఎల్ మేనేజింగ్ డెరైక్టర్ సుకరన్ సింగ్ సంతకాలు చేశారు. ఇప్పటికే బోయింగ్‌కు చెందిన సీహెచ్ 47 చినూక్, ఏహెచ్-6ఐ హెలికాప్టర్లను టీఏఎస్‌ఎల్ ఇక్కడ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.