ముంబైకు బయల్దేరిన విమానం లో సాంకేతిక లోపం ఏర్పడంతో విమానాన్ని కిందకుదింపారు.
* విమానంలో సాంకేతిక లోపం
* 117 మందికి తప్పిన ప్రాణాపాయం
కేకేనగర్: ముంబైకు బయల్దేరిన విమానం లో సాంకేతిక లోపం ఏర్పడంతో విమానాన్ని కిందకుదింపారు. ఈ సమయంలో పెలైట్ లోపాన్ని గుర్తించడంతో 117మంది ప్రయాణికులు ప్రాణాలతో బైటపడ్డారు. చెన్నై విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 6:40 గంటలకు ప్రైవేటు విమా నం ముంబైకు బయలుద్దేరింది. కొద్దిసేపటికే ఇంజన్‌లో లోపం ఉన్న విషయాన్ని గురించారు. ఆ సమాచారాన్ని చెన్నై విమానాశ్రాయం కంట్రోల్ రూమ్ అధికారులకు తెలిపారు. అనంతరం వారి సూచనలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.