ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఏవియేషన్ రంగంపై కన్నేశారు. బెంగళూరు కేంద్రంగా రిలయన్స్ సబ్సిడరీ సంస్థ 'సాంఖ్యసూత్ర ల్యాబ్స్' ఆధ్వర్యంలో విమానాల డిజైన్‌లను తయారు చేస్తున్నారు.
2019లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216కోట్ల పెట్టుబడితో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ సంస్థకు చెందిన 83శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ఈ కంపెనీ హై ఫిడిలిటీ ఏరోడైనమిక్స్, మల్టీఫిజిక్స్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస‍్తోంది. అంటే సులభంగా తక్కువ బడ్జెట్‌లో ఎయిర్ క్ట్రాఫ్ట్‌లను డిజైన్ చేస్తుంది. డిజైన్‌లు రక్షణ రంగానికి ఉపయోగపడనున్నాయి.
ఈనేపథ్యంలో బెంగళూరులో హాల్ మేనేజ్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏరో కాన్-2022 జరిగిన సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏరో స్పేస్ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫిరెన్స్‌లో పైలెట‍్ల అవసరం లేకుండా ఆటోమెటిక్ సిస్టమ్ (అటానమస్ ఎయిర్ బర్న్ సిస్టమ్) ద్వారా విమానాల్ని ఎలా నియంత్రించాలి. ఆ రంగానికి ఎదురయ్యే సవాళ్లు, అందులో అవకాశాల వంటి అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ప్రదర్శించింది. అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ నుంచి ఓ కొత్త ప్రొడక్ట్ విడుదల కానున్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ఆ ప్రొడక్ట్ ఏంటనేది బహిర్గతం కాలేదు.
"ఖచ్చితమైన, నమ్మకమైన విమాన డిజైన్‌ల రూప కల్పన కోసం ఉపయోగించే విండ్ టన్నెల్ వంటి ఖరీదైన ప్రయోగాలు ఎక్కువ సమయం తీసుకునే ప్రయోగాల అవసరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాదు తాము డిజైనింగ్ టూల్స్ కోసం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు కాన్ఫరెన్స్‌లో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ కరివాలా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment