కూలిన మిగ్-27 యుద్ధ విమానం | MiG-27 aircraft of Indian Air Force (IAF) crashed into a building in Rajasthan | Sakshi

కూలిన మిగ్-27 యుద్ధ విమానం

Published Mon, Jun 13 2016 1:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

రష్యా నుంచి భారత్ వైమానిక దళం(ఐఏఎఫ్) కొనుగోలు చేసిన మిగ్-27 యుద్ధవిమానం రాజస్ధాన్ లోని జోధ్ పూర్ వద్ద ఓ బిల్డింగ్ ను ఢీ కొట్టింది.

జోధ్ పూర్: రష్యా నుంచి భారత్ వైమానిక దళం(ఐఏఎఫ్) కొనుగోలు చేసిన మిగ్-27 యుద్ధవిమానం రాజస్ధాన్ లోని జోధ్ పూర్ వద్ద సోమవారం ఓ బిల్డింగ్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరు విమానం కూలిపోక ముందే అందులో నుంచి బయటకు దూకేశారు. బిల్డింగ్ కు వెనుకవైపు నుంచి వెళ్తున్న విమానం ఒక్కసారిగా దానిని ఢీ కొంది. దీంతో విమానం ముందు ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

దీంతో బిల్డింగ్ లోని రెండు ఇళ్లు బాగా దెబ్బతినగా, ఇంటిలోని ఇద్దరికి గాయాలయినట్లు తెలుస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో జరుతున్న శిక్షణా శిబిరంలో పాల్గొంటోందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement