Super App:ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జియో మార్ట్ పనుల్లో రిలయన్స్ గ్రూపు బిజీగా ఉండగా తాజాగా టాటా సైతం రంగంలోకి దిగింది.
రాబోయే రోజుల్లో ఈ కామర్స్ సెక్టార్‌లో గట్టి పోటీ నెలకొనబోతుంది. అమెజాన్‌కి పోటీ ఇచ్చేందుకు ఇండియన్ బిజినెస్ టైకూన్లు రెడీ అవుతున్నారు. వాట్సాప్‌తో కలిసి జియోమార్ట్ పేరుతో ఈ కామర్స్‌లో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ రెడీ అవగా ఇప్పటికే బిగ్ బాస్కెట్‌ను టాటాగ్రూపు కొనుగోలు చేసింది పోటీకి రెడీ అవుతోంది.
టాటా గ్రూపుకు సంబంధించి అపరెల్స్ విభాగంలో టాటా క్లిక్ యాప్ ఇప్పటికే ఉంది. అయితే కూరగాయలు, కిరాణ మొదలు ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్స్ వరకు అన్ని వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మేలా టాటా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా సూపర్ యాప్ పేరుతో టాటా ఈ కామర్స్ రంగంలోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సూపర్ యాప్ పేరుతో మార్కెట్‌లోకి వచ్చే ముందు ఓ సారి టెస్ట్ డ్రైవ్ చేసే ఆలోచనలో టాటా ఉంది. దీంతో టాటా గ్రూపుకి సంబంధించిన ఎంప్లాయిస్ ద్వారా ఆ పని చేయాలని నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టాటాగ్రూపుకు సంబంధించి వివిధ కంపెనీల్లో దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడు లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరినీ సూపర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని టాటా సంస్థ కోరనుంది.
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో భారీ ఎత్తున ఈ కామర్స్ సైట్‌ను ప్రారంభించాలని టాటా నిర్ణయించింది. అంతకంటే ముందు తమ ఉద్యోగుల ద్వారా టెస్ట్ డ్రైవ్ నిర్వహించి లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు మరింత మెరుగైన సేవలు అందిందేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment